Friday 11 October 2013

క్రీడాకారులని చిక్కుల్లో పెట్టిన చైనా

Mihu Maselo,Yumi Somng: Archers

అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఇద్దరు అర్చరీ క్రీడాకారులు చైనా లో జరగబోతున్న ప్రపంచ స్థాయి పోటిల్లో ఫాల్గొనడనానికి సర్వం సిద్ధం చేసుకొని ఢిల్లీ విమానాశ్రయానికి రాగా ఇమిగ్రేషన్ అధికారులు వారిని నిలువరించారు.కారణం వారికి చైనా ప్రభుత్వం మామూలు వీసా కాకుండా స్టేపుల్డ్ వీసా మంజూరు చేయడమే..!ఇతర రాష్ట్రాలకి చెందిన 22 మంది క్రీడాకారులు ఎంచక్కా వెళ్ళిపోయారు.అరుణాచల్ ప్రదేశ్ నుండి తమ దేశం లోకి చొరబాట్లు ఎక్కువ జరుగుతున్నాయని ఈ మధ్య చైనా అరుణాచలీయులకి స్టేపుల్డ్ వీసాలు మాత్రమే ఇస్తుండటం తో ఇలాంటి చిక్కులు వస్తున్నాయి. స్టేపుల్డ్ వీసా ని మాములుగా పాస్ పొర్ట్  తో కాకుండా విడిగా పేపర్ మీద ఇస్తారు.ఆ దేశం లో దిగిన  తరవాత పాస్ పోర్ట్ మీద వారి దేశానికి చెందిన ముద్రలు వేస్తే వేస్తారు..గ్యారంటీ ఉండదు.మొత్తానికి పడ్నాలుగు ఏళ్ళ  ఆ చిన్నారులు బిక్కమొహం పెట్టుకుని ఆగిపోయారు.Click here

No comments:

Post a Comment