Monday 14 October 2013

గోల్డ్ స్మగ్లర్ వల్ల చిక్కుల్లో పడ్డ కేరళ ముఖ్యమంత్రి



కేరళలో పేరెన్నిక గన్న గోల్డ్ స్మగ్లర్ ఫయాజ్ తో కేరళ ముఖ్య మంత్రి ఊమెన్ చాంది కి సంబంధాలు ఉన్నాయని వడక్కర నుంచి కోళికోడ్ వెళ్ళేటప్పుడు కారులో సి.ఎం.తో 45 నిమిషాలు పాటు అతను మంతనాలు జరపడం అందరికీ తెలిసిందేనని సి.పి.ఎం.నాయకుడు పినరాయ్ విజయన్ ఆక్షేపించారు.దీనికి ముఖ్యమంత్రి ప్రతిస్పందించలేదు.

ఇన్వెస్టిగేషన్ ఏజన్సీలు జరిపిన పరిశోధనలో ఊమెన్ చాందీ ప్రైవేట్ సెక్రటరీ తో ఫయాజ్ నెరపిన ఫోన్ కాల్స్ విషయం బయటపడింది. చాందీ దుబాయ్ వెళ్ళినప్పుడు ఫయాజ్ అక్కడ హోస్ట్ గా వ్యవరించాడు.ఇంకొక విషయం ఏమిటంటే కన్ననూర్ సెంట్రల్ జైల్ ఉన్న కొంత మంది సి.పి.ఎం కార్యకర్తలని కూడా ఫయాజ్ కలవడం అది సిసిటివి లో రికార్డ్ కావడం ఆ పార్టీ ని కూడ ఇబ్బందుల్లో పడవేసింది.

గతనెలలో 20 కె.జి.లు బరువుగల బంగారు  కడ్డీలని కేరళ లోకి స్మగ్లింగ్ చేస్తుండగా విషయం బయటపడి ఆ వివాదం లో కొంతమంది కస్టంస్ అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు.38 ఏళ్ళ ఫయాజ్  ఒకప్పుడు హోటల్ లో ఓ సామాన్య కార్మికునిగా ఉండేవాడు.సి.బి.ఐ. ఈ కేసులో మరో కీలక నిందితుడైన అష్రాఫ్ అనే వ్యక్తి కోసం గాలిస్తోంది. అతను దుబాయ్ లో ఉంటూ యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.Click here

No comments:

Post a Comment