Thursday 3 October 2013

కేంద్ర కేబినెట్ తెలంగాణా బిల్లు ఆమోదించటం తో వాతావరణం వేడి పుంజుకుంది



 కేంద్ర కేబినెట్ తెలంగాణా బిల్లు ఆమోదించటం తో వాతావరణం వేడి పుంజుకుంది.తెలంగాణా ప్రాంతం లో హర్షం వ్యక్తం కాగా,సమైకాంద్ర వర్గాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కేబినెట్ బిల్లు ఆమోదించగానే కేంద్ర మంత్రులు చిరంజీవి,కావూరి వంటి వారు తమ పదవులకు రాజీనామా చేశారు.ఉండవల్లి అరుణ్ కుమార్,అనత వెంకట్రామి రెడ్డి లాంటి వారు పార్టీకి రాజీనామా చేసి నిరసన తెలియజేశారు.పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని  ప్రకటించారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని 45 శాతం అటవీ భూమి ,భారత దేశం లోని 20 శాతం బొగ్గు గనులు తెలంగాణా లోనే ఉన్నాయి.సమైకాంద్ర నాయకులు 48 గంటల బంద్ కి పిలుపునిచ్చారు.ఉన్నట్టుండి కేబినెట్ బిల్లుకి ఆమోదం తెలుపడం అందరిని నివ్వెర పరచింది.ఈ నేపధ్యం లో పోలీసు అదనపు బలగాలు శాంతి భద్రతల విషయం లో అప్రమత్తమయ్యాయి.Click here

No comments:

Post a Comment