Friday 4 October 2013

జనాభా తో సతమతమౌతున్న ముంబాయి నగరం



ఇప్పటికి 2 కోట్ల మంది జనాభాతో ముంబాయి నగరం కిక్కిరిసిపోయింది.సరైన పరిశుబ్రత,వసతులు అటుంచి కనీసం మురికి వాడలు ఇంకా పెరగకుండా ఆపలేకపోతోంది మహారాష్ట్ర ప్రభుత్వం.స్థలం ఖరీదు ఆకాశంలో ఉన్నది.ఇళ్ళ అద్దెలు చూస్తే విపరీతంగా ఉన్నాయి.ముఖ్యంగా బాలీవుడ్ లో వెలిగిపోదామని,ఇంకా బతుకు తెరువు కోసం దేశం నలుమూలల నుంచి ముంబాయి కి చేరుకునే వారు ఎక్కువవడమే దీనికి ప్రధాన కారణం.

ఈ సమస్య కి పరిష్కారంగా ఇంకొక బుల్లి నగరాన్ని ముంబాయి కి దగ్గరలో ఉరాన్ సమీపంలో నిర్మించాలని ప్రయత్నాలు జరుపుతున్నారు.ఇది ముంబాయికి శివారు ప్రాంతం లో ఉంటుంది.ఇప్పటికే నవీ ముంబాయి 10 లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తోంది.దానికి ఇది కూడా తోడైతే ముంబాయి నగర జనాభా సమస్య కొంతైనా తీరుతుందని భావిస్తున్నారు.ముంబాయి లో జనాభా వత్తిడి ఎంత ఘోరం గా ఉందంటే ప్రధాన కూడళ్ళ లోనుంచి విమానాశ్రయానికి రావాలంటే కనీసం రెండు గంటలు పడుతోంది.Click here

No comments:

Post a Comment