Wednesday 9 October 2013

రియల్ స్టార్ శ్రీహరి ఇక లేరు



పోలిస్ చిత్రం తో పవర్ ఫుల్ నటుడి గా దూసుకొచ్చిన రియల్ స్టార్ శ్రీ హరి(49) ఈ రోజు ముంబాయిలోని లీలావతి హాస్పిటల్ లో కన్నుమూశారు.గత కొన్ని నెలలుగా లివర్ కి సంబందించిన వ్యాధితో ఆయన బాధపడుతున్నారు.ఎంతో రిస్క్ తో కూడిన పోరాట సన్నివేశాలని సైతం అవలీలగా డూప్ లేకుండా చేసి ఆయన నిజంగానే రియల్ స్టార్ అనే పేరుకి వన్నె తెచ్చారు. దాసరి నారాయణరావు మొదటిగా ఆయన్ని తెలుగు తెరకి పరిచయం చేశారు. 

ప్రముఖ నటి డిస్కో శాంతి ని పెళ్ళిచేసుకుని సినిమా ప్రపంచంలో ఒక నూతన ట్రెండ్ ని సెట్ చేశారు.ఎందుకంటే వ్యాంప్ లతో సహజీవనం ఏం కుదురుతుందిలే అనుకునేవాళ్ళకి కళ్ళు తెరిపించేవిధం గా చక్కగా దాంపత్యజీవితాన్ని గడిపి ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యి అనేక సేవా కార్యక్రమాలని చక్కగా నిర్వహించారు. Click here

No comments:

Post a Comment