Sunday, 13 October 2013

ఇలాంటి దుర్ఘటన ఈమధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదేమో..!

ఇలాంటి దుర్ఘటన ఈమధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదేమో..!గ్వాలియర్ కి 70 కి.మీ.దూరం లో ఉన్న రతన్ ఘడ్  దేవాలయాన్ని నవరాత్రి సంధర్భంగా ఈ రోజు భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు.ఒక దశలో భక్తులని కంట్రోల్ చేయడానికి గాను పోలీసులు జరిపిన లాఠిచార్జ్ తొక్కిసలాటకి దారితీసింది.దగ్గర్లోని బ్రిడ్జ్ కూలిపోతుందని కూడా రూమర్లు వ్యాప్తి చెందటంతో జనాలు చెల్లాచెదరుగా తొక్కులాడటంతో 89 మంది దానిలో పడి దుర్మరణం పాలయ్యారు.వీరిలో 17 మంది పిల్లలు,31 మంది స్త్రీలు ఉన్నారని తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం లేక పోలేదు.2006 లో కూడా ఈ ఆలయ సమీపంలో తొక్కిసలాట జరిగి 20 మంది మరణించారు. Click here

No comments:

Post a Comment