Wednesday 2 October 2013

పద్దతులు నేర్చుకోమంటున్న చైనా ప్రభుత్వం



విదేశాలని సందర్శించడం లో ఉన్న ఆసక్తి దేశ పరువు ప్రతిష్టలు నిలబెట్టడం లో కూడా చూపించాలని చైనా ప్రభుత్వం తమ పౌరులను కోరుతున్నది. ముఖ్యంగా విమాన ప్రయాణం అయిపోయిన తరవాత వాటి లోని లైఫ్ జాకెట్ లని తీసుకుపోకూడదని తెలిపింది.అంతే కాదు పబ్లిక్ లో ఉన్నప్పుడు ముక్కు చీది అవతల వేయడం,స్విమ్మింగ్ ఫూల్స్ లో మూత్రం పోయడం లాంటివి చేయకూడదని హితవు పలికింది.ఇలాంటి విషయాలని తలకెక్కేటట్టు చెప్పడం కోసం 64 పేజీలతో ఒక పుస్తకాన్నే ప్రచురించడం జరిగింది.

ఆర్దిక మాంద్యం లో ఉన్న కొన్ని యూరోపియన్ దేశాలు ఇటీవల ధనవంతులైన చైనా జాతీయులని ఆకర్షించడానికి వీసా నిభంధనలు సులభతరం చేశాయి. దానితో ఆ దేశాలని చైనా టూరిస్టులు బాగానే దర్శిస్తున్నారు.కాని శుభ్రతా నియమాలు గాని మరేమీ పాటించకుండా చికాకు చేస్తున్నారని గమనించి మొత్తానికి ప్రభుత్వమే సంస్కరించాలని పూనుకుంది.


    

No comments:

Post a Comment