Friday 1 November 2013

అతను ఈ సారైనా నిజంగా మరణించాడా..?



మరణించాడనే అంటున్నాయి..వివిధ వర్గాలు.అతడెవరో కాదు పాకిస్తాన్ లో తాలిబన్ మూకలకి నాయకుడు హకీముల్లా మెహ్సూద్.గత శుక్రవారం అమెరికా పాకిస్తాన్ లోని నార్త్ వజీర్ స్థాన్ లో జరిపిన ద్రోన్ దాడుల్లో అతడు మరణించాడని ముక్త కంఠం తో మిలిటరి ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.అయితే ఈ దాడి పాకిస్తాన్ కి చెందిన కొన్ని గూఢచార ఏజన్సీల  సహకారం తోనే జరిగినట్లు వార్త. గతం లో కూడ మెహ్సూద్ చనిపోయినట్లు మూడు సార్లు ప్రకటించారు అయితే ఈసారి నిజమే నని ఘంటపధంగా వార్తా కధనాలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో 7 గురు అమెరికా ఇంటిలిజెన్స్ ఏజంట్ లను మట్టుబెట్టిన ఘటనలో మెహ్సూద్ ప్రధాన వ్యూహదారునిగా ధృవీకరించడం జరిగింది.5 మిలియన్ డాలర్లను ఇతని తలకు అమెరికా ప్రకటించింది.Click here for more

No comments:

Post a Comment