Thursday 19 December 2013

కులాంతర వివాహాల వల్ల జన్మించిన పిల్లలు బాధపడేలా ప్రస్తుతం మన సమాజం ప్రవర్తిస్తున్నదని

కులాంతర వివాహాల వల్ల జన్మించిన పిల్లలు బాధపడేలా ప్రస్తుతం మన సమాజం ప్రవర్తిస్తున్నదని,ఈ తీరు మారాలని,వారు గాంధీ వర్ణానికి చెందిన వారిగా గుర్తించాలని ఆ మేరకు అత్యున్నత కోర్ట్ ఆదేశాలివ్వాలని తమిళనాడు కి చెందిన సేలం వేలు(80) అనే ఒక గాంధేయవాది సుప్రీం కోర్ట్ లో పిల్ ని దాఖలు చేయగా  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ఈ విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వానికి చేయవలసిందిగా కోరారు.భారత సమాజం 9,600 కులాలు గా విడిపొయి పతనదిశగా పయనిస్తోందని,అనేకమంది విదేశీయులు మన దేశాన్ని సులభంగా జయించడానికి ఈ కులం కూడా ఓ కారణమని ..కులం అనేదాన్ని విద్యాలయాల్లో తప్పనిసరి చేయనవసరం లేదని ..ఒక వేళ కులం వెల్లడి చేయడానికి ఇష్టం లేకపోతే వారిని ఒక ప్రత్యేక తరగతి గా పరిగణించి గౌరవించాలని సేలం వేలు కోర్ట్ కి విన్నవించుకోగా భారత ప్రభుత్వానికి తన కోరికని వినిపించే హక్కు ని వినియోగించుకోవాలని ఆయన్ని న్యాయమూర్తి కోరారు.  Click here

No comments:

Post a Comment