Friday 20 December 2013

దొంగలకే దొంగ ఇతగాడు..!


ఈ తరం వారికి రోనీ బిగ్స్ అంటే పెద్దగా తెలియకపోవచ్చునేమో గాని నేర చరిత్ర గనక రాస్తే ఇతనికి ఒక ప్రత్యేకమైన చాప్టర్ కేటాయించవలసిందే..!1963 లో ఈ బ్రిటీష్ బందిపోటు గ్లాస్గో నుంచి లండన్ వెళుతున్న రాయల్ మెయిల్ రైలు లో చొరబడి దాంట్లో 128 బస్తాల్లో ఉన్న దాదాపు 40 మిలియన్ పౌండ్లకి పై గల సొమ్ముని లూటి చేసిపారేశాడు.దాంట్లో మొత్తం అతనితో పాటు నలుగురు ఫాల్గొన్నారు.30 సంవత్సరాలు జైలుశిక్ష విధించగా చాకచక్యంగా పారిపోయాడు.ఆ తరువాత ముఖానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ చాలా దేశాల్లో తిరిగాడు.అతని జీవిత కాలం లో ఎప్పుడూ ఈ దొంగతనం విషయం లో పశ్చాత్తాపపడలేదు.బ్రెజిల్ లో ఉంటూ న్యాయపోరాటం చేశాడు.2001 లో అరెస్ట్ చేసినప్పటికి 2009 లో వృద్ధాప్యం ,అనారోగ్యం కారణాలతో రిలీజ్ అయ్యాడు. 

చివరికి ఈ నెల 18 న తన 84 వ ఏట కన్నుమూశాడు. Click here

No comments:

Post a Comment