Monday 17 March 2014

రష్యా లో కలిసిపోవడానికే మొగ్గుచూపిన క్రిమియన్ ఓటర్లు



ఆదివారం జరిగిన రెఫెరండం లో మెజారిటీ క్రిమియన్ పౌరులు తాము రష్యా లో కలిసిపోవడానికి మద్దతు ఇస్తున్నట్టు తేల్చిచెప్పారు.ఉక్రేయిన్ లో అటానమస్ కలిగిన రిపబ్లిక్ గా ఉన్న క్రిమియా ని రష్యా గత ఫిబ్రవరి లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎక్జిట్ పోల్స్ లో సైతం 93 శాతం వరకు రష్యా కే తమ ఓటు వేశారు.  ఈరోజు రష్యా లో చేరడానికి తాము ధరఖాస్తు చేస్తామని అక్కడి నాయకులు బి.బి.సి.కి తెలిపారు.అయితే క్రిమియా లోని టాటార్ జాతీయులు రెఫెరెండం ని బహిష్కరించారు.వారిశాతం జనాభాలో 12 వరకు ఉంటుంది.ఉక్రేన్లు 24.4 శాతం ఉండగా రష్యన్లు 58.5 శాతం దాకా ఉంటారు.యూరోపియన్ యూనియన్ ,అమెరికా ఈ చర్యని వ్యతిరేకిస్తున్నప్పటికి రష్యా మాత్రం తన దారిలో తాను వెళ్ళిపోతుండడం గమనార్హం.Click here

No comments:

Post a Comment