Monday 28 April 2014

ప్రపంచం లోని 5 ప్రమాదభరిత నగరాల గురించి మీకు తెలుసా..?



మీరు ప్రపంచాన్ని చుట్టి రావాలనుకునే పర్యాటకులా..?అయితే ఎందుకైనా మంచిది ఈ అయిదు ప్రమాదభరితమైన నగరాల గురించి తెలుసుకొండి.పనికొస్తుంది.ఇంకా చాలా లిస్ట్ ఉంది కాని ప్రస్తుతానికి వీటి గురించి మాత్రం తెలుసుకుందాం.


1.Barquisimeto (Venuzuela)

వెనెజులా దేశం లోని Barquisimeto ని మొదటి ప్రమాదభరిత నగరంగా చెప్పాలి.పది లక్షల జనాభా ఉండే ఈ నగరం లో కనీసం రోజుకి ఒక మర్డర్ అయినా జరగవలసిందే.ఇక్కడ యూనివర్శిటీలు,విద్యాలయాలు మళ్ళీ ఎక్కువగానే ఉంటాయి.



2.Peshawar (Pakistan)

పాకిస్తాన్ లోని పెషావర్ రెండవ డేంజరస్ సిటీ గా చెప్పవచ్చు. ముఖ్యంగా విదేశీయుల కి చాలా జాగ్రత్తగా ఉండవలసిన నగరం.అందమైన పార్కులు,ఇతర చూడదగ్గ కట్టడాలు ఉన్నప్పటికి ఎప్పుడు ఏ వైపునుంచి ఏమి ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేము.సెక్యూరిటి దళాల పైనే దాడులు జరుగుతుంటాయి.స్థానిక తెగలు ఆధిపత్యం కోసం పోరాటాల్లో మునిగితేలుతుంటాయి.



3.Sana'a (Yemen)

ఆఫ్రికా ఖండం లోని ఈ Sana'a  నగరం మూడవ ప్రమాదభరిత నగరం.పాత నగరం ప్రాంతం మరీ ప్రమాదం.యెమెన్ దేశం లోని ఈ హై రిస్క్ ప్రాంతానికి సాహసించి వెళ్ళవలసిందే.



4.Acupulco (Mexico)

ఒకానొక  సమయం లో పాపులర్ బీచ్ లతో కళకళ లాడే ఈ Acupulco నగరం తన ప్రతిష్టని కోల్పోయింది.డ్రగ్ కార్యకలాపాలు,మాఫియా వాతావరణం రాజ్యమేలుతుంటాయి.ఇక్కడి పోర్ట్ సిటీ లో అనామక శవాలు గుట్టలుగా ఉన్నా ఆశ్చర్యపోకూడదు.



5.Distrito Central (Hondurus)

ఈ సిటీ లో కూడ మర్డర్ ల శాతం అధికం గా ఉంటుంది.ప్రభుత్వం కూడా అక్రమ అక్రమ,అవినీతి కార్యక్రమాల్లో మునిగితేలుతుంది.నేరస్థుల స్వర్గం లాంటిది ఈ Distrito Central.

No comments:

Post a Comment