Saturday 10 May 2014

కృత్రిమంగా పండబెట్టినందుకు మామిడికాయల వ్యాపారి పై కేసు



ఇష్టం వచ్చినట్లు కృత్రిమంగా అరటికాయల్ని,మామిడి కాయల్ని పండబెట్టి మార్కెట్ లో అమ్మేవాళ్ళని మనం చూస్తూనే ఉంటాం.అవి తిని కడుపు  అంతా నొప్పి తెచ్చుకోవడం మనకి అనుభవమే.అయితే గోవా ప్రభుత్వం మటుకు ఇలాంటి ఓ వ్యాపారి పై కేసు పెట్టి చర్యతీసుకోవడం గమనించదగ్గ విషయం.మామిడి పళ్ళలో అతి శ్రేష్టమైన రకంగా గుర్తింపు పొందిన "అల్ఫోన్సా" పళ్ళలో కాల్షియం కార్బైడ్ పవడర్ ని చల్లి కృత్రిమంగా మగ్గేటట్టు చేసి వాటిని యూరోపియన్ యూనియన్ కి ఎగుమతి చేయగా వాళ్ళు తిప్పి పంపేశారు.ఈ పళ్ళ వ్యాపారి సలీం వెల్జి పై గోవా రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అధారిటి ఈ రోజు కేసు పెట్టింది.Click here

No comments:

Post a Comment