Wednesday 7 May 2014

F.B.I. ఏజంట్ ని అరెస్ట్ చేసిన పాకిస్తాన్ పోలీసులు



గత సోమవారం కరాచి నుంచి ఇస్లామాబాద్ వెళుతున్న విమానం లో పిస్టల్ ని,బులెట్ల ని తనతో పాటు ఉంచుకొని ప్రయాణించబోతున్న అమెరికన్ అధికారిని విమానాశ్రయ సెక్యూరిటీ అధికారులు నిలిపివేశారు.సరైన పత్రాలని వాటికి సంబందించి చూపలేదని అతన్ని పోలీసులకి అప్పగించారు.వారం పాటు కష్టడీ లోకి తీసుకున్నారు.విచారణలో అతను F.B.I అధికారిగా తెలిసింది.కోర్ట్ ఆ నేరం పై అతనికి 14 ఏళ్ళ జైలు శిక్ష విధించవచ్చు. పాక్ లోని మీడియా ఈ విషయాన్ని పెద్దగా ప్రచారం లో పెట్టకపోవడం విశేషం.

అయితే పాక్ లోని అమెరికన్ ఎంబసీ అధికారులు ఈ వార్తని ధృవీకరించారు.ఇతడిని  రక్షించే దిశలో అమెరికన్ వర్గాలు రంగం లోకి దిగవచ్చునని భావిస్తున్నారు.2011 లో ఒక C.I.A.
ఏజంట్  రేమాండ్ డోలస్ లాహోర్ లో ఇద్దరు పాక్ పౌరుల్ని కాల్చి చంపగా అతనికి మరణ శిక్ష విధించవలసిందిగా పాక్ పౌరులు నినదించారు.అయితే 2 మిలియన్ డాలర్ల ని అమెరికన్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు చెల్లించి అతని ని బయటకు తెచ్చింది.Click here

No comments:

Post a Comment