Monday 2 June 2014

రజనీకాంత్ మేజిక్ ఈ సారి పనిచేయలేదా..?



కొచ్చడయాన్ అనే పేరుతో తమిళ మాతృక గా రూపొందిన రజనీ సినిమా ఈ సారి ఇతర భాషల్లో అంతగా వర్కవుట్ అయినట్లు లేదు.చోళుల కాలం లో ని ఓ చిన్నకధని తీసుకొని డెవెలప్ చేశాడు కధకుడు రవికుమార్. ఆ నేటివిటిని ఇతర భాషల్లో కి డబ్బింగ్ చేయబడిన ఆ సినిమా సరిగ్గా తీసుకెళ్ళలేదని అంటున్నారు.తెలుగు వెర్షన్ కి వస్తె మొదటి వారం లో వసూళ్ళు 'మనం'సిన్మా కంటే చాలా తక్కువగా ఉన్నాయి.తమిళంలో మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి కలెక్షన్లు.

6 భాషల్లోకి అనువదించబడిన ఈ సినిమా ఓవర్సీస్ వసూళ్ళు 12 కోట్లుగా తేలగా,తమిళం లో 30 కోట్లుగా చెబుతున్నారు. ఫోటో రియలిస్టిక్ పెర్ఫార్మన్స్ టెక్నాలజీ లో తీసిన ఈ సినిమా లో రజనీ పాత్ర సైతం  అంత ఆకర్షణీయంగా లేదని ,కార్టూన్ నెట్వర్క్ చూసినట్టుగా ఉందని ఆడియన్స్ భావిస్తున్నారు.Click here

No comments:

Post a Comment