Saturday 21 June 2014

ఆదాయాన్ని పెంచుకుంటున్న తాలిబన్లు (విశేష వార్త)



ఒక వైపు అమెరికా తన దళాలను ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉపసమ్హరించుకోవడానికి ఉద్యుక్తురాలవుతుండగా,మరో వైపు యునైటెడ్ నేషన్స్ కి చెందిన రిపోర్ట్ లు ఆందోళనకరంగా బయటికి వస్తున్నాయి.తాలిబన్లు ధన సంపాదనలో కొత్తపుంతలు తొక్కుతూ ఫండ్స్ ని విపరీతంగా సేకరిస్తున్నాయని ..ఇవి జీహాది ఉగ్రవాదులకు ఉపయోగపడే దిశగా ఉంటున్నాయని తెలుపుతున్నాయి.

గత ఏడాది గంజాయి సాగుతో వచ్చిన ఆదాయం వారికి ఇబ్బడిముబ్బడిగా ఉన్నది.ఇదిగాక extortion వంటి పద్ధతులనుంచి,సహజ వనరులను అక్రమంగా సేకరించడం ద్వారా కూడా ఆదాయం సేకరిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ లోని హెల్మండ్ ప్రాంతం ఓపియం పంటకి ప్రసిద్ది చెందింది.Poppy ని పండించడం ఇక్కడ నిత్యకృత్యం.ఇలాంటి మాదక ద్రవ్యాల పంటల్ని పండించటానికి డ్రగ్ స్మగ్లర్లు రైతులకి రుణాలు,ఫర్టిలైజర్లు అందజేస్తుంటారు.రైతులు తమ ఆదాయం లో 10 శాతం ని తాలిబన్ లకు పన్నుగా చెల్లించాలి.ఇప్పటికే ఈ ఏడాదికి దాదాపు 50 మిలియన్ డాలర్ల ఆదాయం వారికి సమకూరింది.

హెల్మండ్ నుంచి ఉత్పత్తి అయ్యే Onyx-Marble గనుల నుంచి ఏడాదికి 10 మిలియన్ డాలర్ల కి పైగా తాలిబన్లు పొందుతుంటారు.పాకిస్తాన్ లోని తాలిబన్ నాయకత్వానికి దీని నుంచి 80 శాతం వెళుతుంది.అక్కడి వివిధ గ్రూపులకి మళ్ళీ తిరిగి ఈ నిధుల్లోనుంచి పంపిణీ చేస్తారు.

మనీ లాండరింగ్ ద్వారా కూడా ఆర్దిక వనరులను వివిధ రూపాల్లో పెంచుకుంటున్నారు.ఈ వ్యవహారాలకి సంబందించి మాలిక్ నూర్జాయ్,అతని సోదరుడు ఫైజుల్లా నూర్జాయ్ యునైటెడ్ నేషన్స్ చేత ఎత్తిచూపించబడినప్పటికి వాళ్ళు వేరే covering business లను ఎన్నుకుంటున్నారు.

ఈ ఫండ్స్ లో వాటా కోసం కొత్త జీహాది గ్రూపులు పుట్టుకొస్తున్నాయి.Al-fath,Tora bora,Fidayano mahaz  ఇలాంటివి అలా వచ్చినవే.ఆ చివరి సంస్థ ని నిర్వహించేది తాలిబన్ టాప్ కమాండర్ అయిన ముల్లా దాదుల్లా అబ్దుల్లా సోదరుడే.ఆల్ ఫత ని నిర్వహిస్తున్నది మరో యుద్ధ ప్రభువు గుల్బుద్దీన్ హక్మత్యార్ అనుచరులు.ఇక తోరా బోరా ని నడిపేది ఒసామా ని ఆఫ్ఘనిస్తాన్ కి మొదట ఆహ్వానించిన యూనస్ ఖలిస్ తనయుడే..!

ఈ ఆర్దికలావాదేవీ ల్లో ఒక్కోసారి రక్తపాతం కూడా జరుగుతుంది.లగ్మన్ ప్రావిన్స్ లో తాలిబన్ ప్రధాన నేతల్లో ఒకరిపై గత ఏడాది చివరిలో హత్యా యత్నం జరిగింది.తాలిబన్ సిద్ధాంతకర్త ల్లో ఒకరైన అబ్దుల్లా జకేరి ని ఇలాంటి వివాదం లోనే కాల్చిచంపారు.

తాలిబన్ కమాండర్ల లో ప్రముఖులైన అబ్దుల్ ఖయ్యుం జకీర్,ముల్లా ఘాజీ,అఖ్తర్ మహమ్మద్ మన్సూర్ షా మహమ్మద్ ...ఆర్దిక వ్యవహారాల కమిటీ చీఫ్ ఇషక్జాయ్ వీరంతా ఓపియం సాగు ద్వారా వస్తోన్న సంపాదన విషయంలో అంతర్ వివాదాలతో తలమునకలై ఉన్నారని భావిస్తున్నారు.

             ---News Post Special Desk 

No comments:

Post a Comment