Friday 29 August 2014

సెకండ్ హేండ్ కార్లకు పెరుగుతున్న గిరాకి...!



సెకండ్ హేండ్ అనండి లేదా యూజ్డ్ కార్లు అనండి..భారతదేశం లో వీటికి గిరాకి రోజు రోజుకి పెరుగుతున్నది. ఇంచు మించు దీని మార్కెట్ కూడా కొత్త కార్ల మార్కెట్ తో పోటిపడుతున్నది.Hatchbacks,Sedan వంటి వాటి సెగ్మెంట్ పురోగతిలో ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.హోండా ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని కష్టమర్లు ఇష్టపడుతున్నారని చెప్పారు.

తమ బడ్జెట్ లో కార్లు కొనడానికి 30 ఏళ్ళ లోపు ప్రొఫెషనల్స్ ప్రయత్నిస్తున్నారని..మెర్సిడెజ్ లు ఇప్పటికే 50,000 కి పైగా దేశ రహదారుల పై తిరుగుతున్నాయని ..వీటికి మంచి గిరాకి ఉంటుందని మెర్స్డెజ్ బెంజ్ ప్రతినిధి చెబుతున్నారు.ముఖ్యంగా లగ్జరీ కార్లకి డిమాండ్ బాగా ఉన్నది.టూ వీలర్ నుంచి కారు కి మారుదామని 45 శాతం మంది భావిస్తున్నారట.మారుతి సుజుకి,హ్యూండాయ్, లాంటి బ్రాండ్లకి కూడా గిరాకి పెరుగుతున్నది.ఒక్క OLX వెబ్ సైట్ లోనే 5 లక్షలకి పైగా యాడ్స్ యూజ్డ్ కార్లకి సంబందించి పోస్ట్ అయ్యాయని భోగట్టా....!Click here









No comments:

Post a Comment