Thursday, 2 October 2014

నూతన మద్యపాన చట్టం మా కడుపుకొట్టిందంటున్నారు వాళ్ళు.కేరళ లో ప్రవేశపెట్టిన మద్యపాన నూతన చట్టం చిన్న వ్యాపారస్తుల్ని దెబ్బతీస్తున్నదని అక్కడి చిరు వ్యాపారులు అంటున్నారు.ఇకమీదట 20 ఫైవ్ స్టార్ హోటళ్ళూ ఇంకా ఆ రాష్ట్రప్రభుత్వానికి చెందిన 384 ఔట్ లెట్స్ మాత్రమే నూతన మద్యపాన చట్టం ప్రకారం అమ్మకాలకి అర్హత కలిగిఉంటాయి.మాంసం అమ్మకందారులు,సోడా తయారీ దారులు,టిస్యూ పేపర్ ఉత్పత్తిదారులు,శనగలు ,మిక్సర్ లాంటివి అమ్ముకునే చిరు వ్యాపారులు ఈ చట్టం వల్ల పరోక్షంగా దెబ్బ తిన్నారు.ఇంచుమించు 700 కి పైగా బార్ హోటళ్ళు మూత పడటమే దీనికి కారణం.ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి గాని,ఇతర కాంఫరెన్స్ లు జరపడానికి గాని కంపెనీ లు కూడా ఆసక్తి చూపడం లేదని ఈవెంట్ మేనేజర్లు వాపోతున్నారు.కేరళ ప్రభుత్వ నిర్ణయం పై బార్ హోటల్ యజమానులు సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళారు.సెప్టెంబర్ 30 దాకా స్టేటస్ కో పాటించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

No comments:

Post a Comment