Tuesday, 25 November 2014

మదర్ డైరీ దక్షిణాది ని అలరిస్తుందా..?న్యూఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న మదర్ డైరీ ఉత్పత్తులు ఇక మీదట దక్షిణాది ప్రముఖ నగరాల్లో కూడా విస్తరించనున్నాయి.నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కి అనుసంధానమైన ఈ డైరీ ఒక నెల లోపులో చెన్నయ్ లో ప్రవేశించి,ఆ తర్వాత హైదరాబాద్,బెంగుళూరు ల్లో తన కార్య కలాపాల్ని విస్తరించనున్నది.దాదాపుగా ఆరువేల అవుట్ లెట్ లను ఈ మూడు నగరాల ల్లో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు.పాలతో పాటు 20 దాకా ఇతర ఉత్పత్తుల్ని కూడా మార్కెట్ చేస్తారు.ఎటువంటి అదనపు చార్జ్ తీసుకోకుండా కష్టమర్ ఇంటిదగ్గరకే తమ ప్రోడక్ట్ ల్ని చేరవేస్తుంది ఈ సంస్థ.2012-13 లో ఆరువేల అయిదువందల కోట్లు రెవెన్యూ సాధించిన ఈ సంస్థ 2017 కల్లా 10 వేల కోట్లు సాధించాలని ప్రణాళిక రూపొందిస్తున్నది. Click here

No comments:

Post a Comment