Wednesday, 19 November 2014

ఆ హిస్సార్ లో ఏమిటి అంత రగడ..?గత మంగళవారం నుంచి హిసార్ (హర్యానా) లో ఉన్న సత్లోక్ ఆశ్రమం నుంచి రాంపాల్ బాబా ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి అక్కడి పోలీసులు నానాతిప్పలు పడుతున్నారు.ఈ రోజు కొంతమంది భక్తులో మరి అనుచరులో గాని ఆరుగురు దాకా చనిపోయారు.పన్నెండు ఎకరాల్లో ఉన్న ఆ ఆశ్రమం లో దాదాపు ప్రస్తుతానికైతే 5000 మంది దాకా అనుచరులు ఉండి ఆయన్ని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారు. రాంపాల్ మీద మర్డర్ లాంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.మొదట్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం లో ఇంజనీర్ గా పనిచేసిన రాంపాల్ తాను కబీర్ అవతారం గా ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విస్తరించాడు.వాటితో పాటే చాలా ఆరోపణలు అతని మీద వెల్లువెత్తాయి.ప్రస్తుతం కోర్ట్ ఆదేశాల్ని కూడా ధిక్కరించి పోలీసులకి చిక్కకుండా భక్తుల రక్షణ వలయం లో ఉంటున్నాడు. ఆ రాష్ట్ర డిజిపి వశిష్ట్ అతని తో చర్చలు జరిపేదేమీ లేదు తొందరలో అరెస్ట్  చేస్తాం అంటున్నారు.మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,రాజస్థాన్ నుంచి వచ్చిన భక్తులు ఆ ఆశ్రమం లో ఉండి అతన్ని అరెస్ట్ కానీయకుండా చేస్తున్నారని భావిస్తున్నారు.ఏం జరుగుతుందో వేచి చూడవలసిందే..!Click here

No comments:

Post a Comment