Sunday 9 November 2014

స్థానిక ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఇక మీదట అది నేరమే..బిల్ మీద సంతకం పెట్టిన గవర్నర్..!



గుజరాత్ రాష్ట్రానికి నూతన గవర్నర్ గా రాగానే ఓ.పి.కోహ్లి ఓ కీలక బిల్లు పై సంతకం చేశారు.స్థానిక ఎన్నికల్లో ఏ పౌరుడు ఓటు చేయ్యకపోయినా ఇక మీదట ఆ చర్య  శిక్షార్హం గా మారుతుంది.అంటే తప్పనిసరిగా ఓటు హక్కున్న ప్రతి వారు ఓటు వేసి తీరాలన్నమాట.గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ సెక్రెటరి ఈ బిల్లు పై గవర్నర్ సంతకాన్ని మీడియాకి దృవీకరించారు.మన దేశం లోనే ఇలాంటి చట్టాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం గా గుజరాత్ నిలబోతున్నది.నిజానికి నరేంద్ర మోడి ముఖ్యమంత్రి గా ఉన్న 2009 లోనే ఈ బిల్లుని ప్రతిపాదించగా అప్పటి గవర్నర్ కమల బేణీవాల్ దాన్ని తిప్పిపంపించారు.ఓటర్లను ఓటు చేయమని వత్తిడి చేయడం  రాజ్యాంగానికి వ్యతిరేఖమైనచర్య అని అప్పటి గవర్నర్ భావించారు.Click here

No comments:

Post a Comment