Tuesday 16 December 2014

84 ఏళ్ళ వయసు లోను ఆ నటుని తీరే వేరు..!



అటల్ బిహారీ పాండా ..ఒడిశా రంగస్థల నటునిగా పేరెన్నిక గన్న ఈయన ఇటీవల విడుదల అయిన ఆదిం విచార్ అనే ఒడియా సినిమా లో ఓ వృద్ధ గిరిజనుని పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందారు.ఆ పాత్ర పేరు కొంధ బుధ ,కొంధమాల్ ప్రాంతం లో నివసించే కొంధ తెగ మీద అల్లిన కధ అది.కపిలేశ్వర్ మొహపాత్ర రాసిన కధ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకున్నది.దీనికి మొదటి భాగాన్ని సాల బుధ అనే పేరుతో తీశారు.దర్శకుడు సబ్యసాచి మొహపాత్ర నన్ను తన సినిమాలో నటించమని కోరినప్పుడు నా వయో భారం వల్ల ఒప్పుకోలేదు.అంతేగాక నాకు అంతకు ముందు సినిమా ల్లో నటించిన అనుభవం కూడా లేదు.దాదాపు 100 నాటకాల్లో నటించాను.63 నాటికలు రాశాను,అయితే కెమెరా అనుభవం గూర్చి తనకి వదిలిపెట్టమని మరీ మరీ దర్శకుడు కోరడం తో నటించాను.రెండు సినిమాలు ఇండియన్ పనోరమ కి ఎన్నిక కావడం,ఇంకా ఉత్తమ నటుని గా అవార్డ్ రావడం సంతోషకరమైన విషయాలు అంటున్నాడు ఈ అటల్ బిహారీ పాండా.

కమర్షియల్ చిత్రాల్లో కంటే ఆర్ట్ చిత్రాల్లో నటించడమే తనకిష్టం అంటున్నాడీయన.కటక్ లోని జనతా రంగ మంచ్ కి చెందిన  ప్రఖ్యాత రంగస్థల నటుడు బాలయ్ బెనర్జీ లా నటిస్తూ స్టేజ్ మీద నే కన్నుమూయాలనేది పాండా అభిమతం.Click here 

No comments:

Post a Comment