Monday 1 December 2014

ముంపు మండలాల్లో ఉద్యోగులపై తెలంగాణా ప్రభుత్వానికి ఎలాంటి విధానం లేదా..?



ఖమ్మం జిల్లా లో ఉన్న చింతూరు,కూనవరం,వి.ఆర్.పురం,భద్రాచలం (గ్రామ పంచాయితీ తప్ప),కుక్కునూరు,వేలేరు పాడు మండలాలు రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కలిశాయి.దీని లో మొదటి నాలుగు మండలాలు తూర్పు గోదావరి జిల్లా లో కలవగా,చివరి రెండు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లా లో కలిశాయి.అయితే ఈ మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా తెలంగాణా స్థానికులే.ఉపాధ్యాయులంతా ఖమ్మం జిల్లా సెలెక్షన్ ద్వారా నియమింపబడినవారే.ఏ నెలకి ఆ నెల ట్రేజరీ ద్వారా తెలంగాణా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తున్నది.మమ్మల్ని ఈ ప్రాంతాలనుంచి తీసి తెలంగాణా కి బదిలీ చేయవలసిందిగా ఇక్కడి ఉద్యోగులు,ఉపాధ్యాయులు కోరుతున్నారు.ధర్నాలు ,ఆందోళనలు కూడా ఈ విషయమై నిర్వహిస్తున్నారు.గత నెలలో కూడా వీరంతా ఖమ్మం లో ధర్నా చేశారు.తెలంగాణా ఉద్యమం లో మేము ఫాల్గొన్నాము,మా జీతాల్లో కూడా కోత పెట్టించుకున్నాం,సకల జనుల సమ్మెలో ఫాల్గొన్నాం..కాని ప్రస్తుతం తమని తెలంగాణా వైపు వెంటనే తరలించడానికి ఎందుకు తెలంగాణా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని వీరి ఆవేదన.

ఇంతకంటే చిత్రమైన వార్త ఏమిటంటే ఇప్పటికే కొన్ని శాఖలకి చెందిన ఉద్యోగులు వైద్య,పశువైద్య శాఖల ఉద్యోగులు,వి.ఆర్.వో. లు వంటి వారు ఇంకా ఇతరులు  సెక్రెటేరియట్ స్థాయి నుంచి వారి శాఖల అధిపతులనుంచి గ్రీన్ సిగ్నల్ పొంది హాయిగా ఖమ్మం జిల్లా లోకి బదిలీ అయిపోయారు.అయితే వారి తోటి రాష్ట్ర ఉద్యోగులైన జిల్లా పరిషత్,ఆశ్రమ పాఠశాలలకి చెందిన అనేక మంది ఉపాధ్యాయులు ఇప్పటికీ ఈ ముంపు మండలాల్లోనే ఉండిపోయారు.ఒక వైపు ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా స్పందిస్తూ పరిపాలనని తమ స్వాధీనం లోకి తెచ్చుకొంటున్నది.కీలకమైన అధికారులను నియమించింది.ముంపు ఉద్యొగుల గోడు ముందు గొయ్యి,వెనుక నుయ్యి లా మారింది.Click here

No comments:

Post a Comment