Monday 23 February 2015

వీర్యాన్ని అమ్మి లక్షలు సంపాదిస్తున్నాడు



ఆ రైతు పేరు కరం వీర్ సింగ్,హర్యానా లోని సునయ్రో గ్రామానికిచెందిన ఈయన తన ముర్రా జాతికి చెందిన దున్న యొక్క వీర్యాన్ని అమ్మి నెలకి అక్షరాలా ముప్ఫై లక్షలు ఆర్జిస్తున్నాడు.ఆ దున్న పేరు భీం అని పెట్టుకున్నాడు.మంచి బలమైన జాతికి చెందిన అది రోజుకి 4 నుంచి 5 మిల్లీ లీటర్ల వీర్యాన్ని ఇస్తుంది.దీనికి మార్కెట్ లో దేశ వ్యాప్తంగా విపరీతమైన గిరాకి ఉంది.ఈ భీం తమ్ముడు యువీ ని ఎనిమిది కోట్ల రూపాయలకి అమ్మేశాడు.ప్రస్తుతం భీం ని 12 కోట్ల రూపాయల ధరకి కొనడానికి ముందుకొస్తున్నా సింగ్ గారు అమ్మదలుచుకోలేదట.దాన్ని తన కుమారుని మాదిరిగా చూసుకుంటూ రోజుకి రెండు వేల రూపాయల దాణాని పెడుతున్నాడట.Click here 

No comments:

Post a Comment