Tuesday, 3 March 2015

ఇద్దరు బ్లాగర్లను చంపిన హంతకుణ్ణి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.బంగ్లాదేశ్ లో ని ఢాకా లో గత గురువారం అమెరికా లో నివసించే బంగ్లా జాతీయుడైన అవిజిత్ రాయ్ ని ఘోరంగా నరికి చంపిన ఫరాబీ షఫీయుర్ రెహ్మాన్ ని నిన్న బంగ్లాదేశ్ కి చెందిన రేపిడ్ యాక్షన్ దళాలు అరెస్ట్ చేశాయి.అవిజిత్ రాయ్ నాస్తికుడు,అతని భావ జాలాన్ని చెబుతూ ముక్త మనో అనే బ్లాగ్ ని రాస్తూ  ఉండేవాడు.స్వతహాగా బంగ్లాదేశీయుడైన రాయ్ 15 ఏళ్ళ క్రితం అమెరికా కి వలస వెళ్ళాడు.అక్కడ నుంచి అతని రాతలని  ఆపమని బెదిరిస్తూ ఈ రెహ్మాన్ ట్విట్టర్ లో ఫేస్ బుక్ లో కూడా బెదిరించాడు.ఈ నెల లో బుక్ ఫెయిర్ కి గాను ఢాకా వచ్చిన రాయ్ ని రిక్షా లో వెళుతుండగా మాటు వేసి ఆపి మరీ చంపాడు ఈ రెహ్మాన్.గతం లో 2010 లో కూడా ఓ బ్లాగర్ ని చంపిన కేసు లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు.Click here

No comments:

Post a Comment