Sunday 28 June 2015

పిచుకల సంతతి ని ఆ విధంగా పెంచుకున్నారు ఆ గ్రామస్తులు..!



నానాటికి పిచుకలు కనబడకుండా పోతున్నాయి.ఆధునిక జీవన ప్రయాణం లో కనుగొన్న యాంత్రీకరణ వల్ల,ఆహారం దొరకకపోవడం వల్ల ఆ పక్షి జాతి నశిస్తున్నదే అని పర్యావరణ ప్రేమికులు బాధపడుతుంటారు.అదిగో అలాంటి వారికి ఒడిశా రాష్ట్రం లోని పురునాబంద్ గ్రామస్తులు ఒక తీపి కబురు అందిస్తున్నారు.2007 సంవత్సరం లో కేవలం ఏడు పిచుకలను చేరదీసి ఇప్పటికి వాటిని 302 పిచుకలుగా వృద్ది చేశారు.గ్రామస్తులు మట్టి కుండలు,వెదురు కర్రలు,గడ్డి వంటి వాటి తో వాటికి గూళ్ళు తయారు చేశారు.అలాగే ధాన్యం దొరికే విధంగా కొన్ని బాక్స్ ల్ని ఏర్పాటు చేశారు.దానితో చక్కగా ఆ పిచుకలు తమ సంతతిని అభివృద్ది చేసుకున్నాయి.పెస్టిసైడ్స్ వాడటం ఎక్కువ కావడం వల్ల పొలాల్లో దొరికే కొన్ని ఆహారంగా పనికి వచ్చే సూక్ష్మ క్రిములు వీటికి అందకపోవడం,ఇంకా కొన్ని చెట్ల బెరళ్ళ లో కూడా ఆహారం దొరక్కుండా పోవడం వీటి సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలు.మొత్తానికి పిచుకల సంతతిని అభివృద్ది చేసిన గంజాం జిల్లాలోని ఆ గ్రామస్తులు అభినందనీయులు.రబీంద్రనాధ్ సాహు కార్యదర్శి గా ఉన్న  రుషికుల్య సముద్ర ఖైంచ సమితి గ్రామస్తులకి తన సహకారాన్ని అందిస్తున్నది.Click here 

No comments:

Post a Comment