Wednesday 8 July 2015

రోబోల గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!




Robot అంటే ఏమిటి..?

Robot అనే మాటకి అర్ధం మనిషి చేత తయారు చేయబడిన యంత్రం అని..!మనిషి చేసే పనులను,ఇతరములను చేయగలిగి ఉంటుందది.దీనిలో కొన్ని రిమోట్ చేత పని చేసేవి...మరికొన్ని ఆటోమేటిగ్గా పనిచేసేవి.కొన్ని Robot లు మనుషులు మాదిరిగాను,కొన్ని జంతువులు గాను ఇంకొన్ని చాలా చాలా చిన్నగా కూడా ఉండవచ్చు.అవి చేసే పనులను బట్టి వాటి ఆకారాలు ఉంటాయి.

Robotics అంటే ఏమిటి..?

Robots గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని Robotics అంటారు.వాటిని డిజైన్ చేయడం ,ఆపరేట్ చేయడం ఇంకా ఇతర అప్లికేషన్లను అంటే కంప్యూటర్ల ద్వారా Robot ల యొక్క Sensory feedback ని తీసుకోవడం..కంట్రోల్ చేయడం వంటివి దీనిలో భాగంగా చెప్పవచ్చును.పరిశ్రమలలో ,పరిశోధనాశాలల్లో ..ఇళ్ళలో వీటి వాడకం పెరుగుతుండటం తో రోబోటిక్స్ శాస్త్రం చాలామందిని నేడు ఆకర్షిస్తోంది.మనుషులు చేయడానికి ప్రమాదకరంగా ఉండే కొన్ని పనులను చేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు.ఉదాహరణకి బాంబుల్ని డిఫ్యూజ్ చేయడం,గ్యాస్ ట్యాంకుల్లో,అగ్ని పర్వతాల్లో,గనుల్లో ప్రమాదకరమైన పనులు చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.అంగారక గ్రహం పైకి కూడా Robot లని పంపించి కొన్ని పరిశోధనలకి ఉపయోగించడం జరిగింది.

Robot అనే మాట ఎక్కడ ఉద్భవించింది..?



ఈ మాట చెక్ భాష నుంచి పుట్టింది.ఆ దేశానికి చెందిన Karel Capek అనే రచయిత 1921 లో తను రాసిన Rossum's Univerasal Robots నాటకం లో ఈ పదాన్ని మొదటిగా వాడాడు.ఈ నాటకం లో జీవ,భౌతిక,రసాయన శాస్త్రాల్లో పరిణితి సాధించిన ఓ శాస్త్రవేత్తల బృందం అన్నిపనులు చేయగలిగిన రోబో లని తయారు చేస్తారు.అయితే వాటికి ఆత్మ ఉండదు..అంతే తేడా..!దాంట్లో తెలివి మీరిన రెండు రోబోలు మాత్రం తమని సృష్టించిన శాస్త్రవేత్తలనే చంపబోతాయి.అంతలో మరో మంచి రోబో శాస్త్రవేత్తల్ని ఆదుకుంటుంది.ఆ నాటకం ఆ రోజుల్లో మంచి పాపులారిటి సాధించింది.ఆ తర్వాత సైన్స్ ఫిక్షన్ లో రోబో  లు ప్రధాన పాత్రగా మారి పోయాయి. (సశేషం) Click

No comments:

Post a Comment