Sunday, 3 April 2016

స్మశానాలకి అంత డిమాండా..?చైనా లో ఇప్పుడు బాగా బూం ఉన్న బిజినెస్ ఏమిటో తెలుసా..? స్మశాన వాటిక ల బిజినెస్..! చనిపోయిన తల్లి దండ్రులకి శాస్త్రోక్తంగా సమాధులు నిర్మించాలనేది అక్కడి వారి నమ్మకం.దానివల్ల స్థలం కొరత ఏర్పడి బీజింగ్ లాంటి నగరాల్లో అయితే ఊరి శివారుల్లోని గ్రామాల్లో నిర్మించవలసి వస్తోంది.ఈ సమాధులు నిర్మించే బిజినెస్ లో ఉన్న లింగ్ షాన్ సిమెట్రీ కంపెనీ వాళ్ళు గత ఏడాది 83.3 శాతం లాభాలు పొందారు.కాగా ఈ ఏడాది లాభాలు ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నారు.సగటున 70 వేల యువాన్ లని ఒక్కొక సిమెట్రీ ని నిర్మించడానికి చైనీయులు ఖర్చు చేస్తారు.పర్యావరణానికి ముప్పులేని రీతి లో అంటే కాల్చిన శవం బూడిదని సముద్రం లో వేయడం లాంటి విధానాల్ని పాటించమని చైనా ప్రభుత్వం వారి పౌరులకి సలహా నిస్తోంది. 

No comments:

Post a Comment