Tuesday 31 May 2016

పులకింపజేసే డార్జిలింగ్ పర్యటన


మన దేశానికి ఈశాన్య భాగం లో ఉన్న చక్కని పర్వతీయ పట్టణం డార్జిలింగ్.ప్రకృతి సౌందర్యం కలబోసినట్లు ఉండే ఆ పట్టణం నుంచి చూస్తే మనకి హిమాలయల లోని కాంచన్ జంగ పర్వత శిఖరం దేదీప్యమానంగా కనపడుతుంది.సముద్ర మట్టానికి 6,710 మీటర్లు ఎత్తున ఉండే ఈ పట్టణం కి మనం ఈ మే నెల లో వెళ్ళినా రమారమి 14 డిగ్రీల సెల్సియస్  కి మించదు తాపం.టీ తోటలు ఇతర పండ్ల తోటలతో కళకళ లాడే ఈ పట్టణాన్ని చాలామంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.నేపాల్ నుంచి వచ్చిన గూర్ఖాలు ఇక్కడ ఎక్కువగా స్థిర నివాసం ఉంటారు.అలాగే టిబెటన్ లు,భూటానీస్ కూడా తక్కువ సంఖయలో ఉంటారు.గూర్ఖాలు హిందువులు కాగా మిగతా వారు బుద్దిస్ట్ లు .క్రీ.శ.1800 ల లోనే బ్రిటీష్ వారు ఈ ప్రాంతాన్ని వేసవి విడిది గా ,విశ్రాంత ప్రదేశం గా వాడుకునేవారు.మార్క్ ట్వైన్ వంటి రచయిత కూడా ఈ ప్రాంతాన్ని దర్శించి గొప్ప ప్రశంసలు కురిపించాడు.



ఇక్కడనుంచి సిక్కిం రాజధాని గాంగ్టక్ కి నాలుగు గంటలు ప్రయాణం.గత ఏడాది నేపాల్ లో వచ్చిన భూకంపం వల్ల ఇక్కడ కూడా ప్రకంపనలు వచ్చాయి గాని నష్టం ఏమీ జరగలేదు.ఈ సీజన్ లో కొద్దిగా టూరిస్ట్ లు తగ్గినా మళ్ళీ క్రమేపీ పుంజుకుంటున్నదని ,హోటళ్ళు పూర్తిగా బుక్ అయ్యాయని అక్కడి ప్రతినిధులు చెబుతున్నారు.

No comments:

Post a Comment