Sunday 26 November 2017

ఇప్పుడు ఈ కొత్తరకం కోడి మాంసానికి గిరాకి పెరుగుతోంది..



చత్తిస్ ఘడ్ లోని దంతెవాడ ప్రాంతం అనగానే మావోఇస్ట్ ఘటనలతో అట్టుడుకుతున్న ఏరియా గా అనుకుంటాం.అయితే ఇప్పుడు ఇక్కడ పెంచబడుతున్న "కడక్నాత్" అనే నల్లరంగు కోళ్ళు వాటి మాంసం తో అందరని ఊరిస్తున్నాయి.ఇవి చూపులకే కాదు వీటి మాసం కూడా నల్ల రంగు లోనే ఉంటుంది.అంతేకాదు గుడ్లు కూడా అదే కలర్ లో ఉంటాయి.స్థానికం గా కలీ మాసి రకం కోళ్ళు అని కూడా అంటారు.దీని మాంసం ధర మామూలు బ్రాయిలర్ కోడి తో పోల్చితే మూడు రెట్లు ఎక్కువ.పోషక విలువలు సైతం ఎక్కువ అని అంటున్నారు.సుమారు 76 మంది వ్యాపారస్తులు లక్ష కోళ్ళ దాకా పెంచుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం సైతం సహకారమందిస్తోంది.మన హైదరాబాద్ లో వీటి మాసం వడ్డించే హోటళ్ళు నాలుగు దాకా ఉన్నాయి.మహారాష్ట్ర,గుజరాత్ లకి కూడా సరఫరా జరుగుతోంది.భవిష్యత్ లో ఇంకా విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


మధ్య ప్రదేశ్ లోని ఝబువా ,ధార్ జిల్లాల్లో అసలు ఈ కోళ్ళ పెంపకం ముందు జరిగింది.ఆ తర్వాత నెమ్మది గా చత్తిఘడ్ లోని దంతె వాడ కి ఈ కోళ్ళు తేబడ్డాయి.వ్యాపారం బాగా ఉండడం తో ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారం తోడై మూడు పువ్వులు ఆరు కాయలు గా వృద్ధి చెందుతోంది.ఈ దంతెవాడ లోని ప్రఖ్యాత దేవత దంతేశ్వరీ మాత వల్ల ఈ ప్రాంతం ఎప్పటి నుంచో పేరెన్నిక గన్నది.చుట్టుపక్కల జిల్లాలు సుక్మా,బిజాపూర్ మొన్నటి దాకా నక్సల్ ప్రభావిత హింస కి చిరునామా గా ఉన్నప్పటికీ క్రమేణా వాతావరణం మారుతున్నది.

No comments:

Post a Comment