Saturday 12 October 2013

తుఫాన్లకు ముద్దు పేర్లు ఎందుకు పెడుతున్నట్టు...?



ప్రమాదస్థాయిలను దృష్టిలో ఉంచుకొని తుఫాన్ లను మొత్తం అయిదు కేటగిరిలుగా వాతావరణవేత్తలు విభజించారు.ఈ రోజు సాయంత్రం ఉత్తర ఆంధ్ర,ఒడిశా తీర ప్రాంతాలని అతలాకుతలం చేయబోతుందని పరిగణించబడే ఫైలిన్ నాల్గవ కేటగిరిలోకి వస్తుంది.ఈదురు గాలులు చాలా భయంకరంగా గంటకి 225 నుంచి 279 కి.మి. వేగం తో వీస్తాయి.ఇళ్ళు,పంటపొలాలు ఇతర నిర్మాణాలు ఘోరంగా దెబ్బతింటాయి.విద్యుత్ ని పూర్తిగా ఆపివేడం మంచిది.లేనట్టయితే మరిన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది.

అసలు మనుషులకి పేర్లు పెట్టినట్టు ఈ మధ్యన తుఫాన్లకి ఎందుకని ముద్దు పేర్లు పెడుతున్నారు.ఆ అనుమానం మీకు వచ్చింది కదూ..!అందరికి ఈజీగా గుర్తుంచుకోవడానికి,ఒకరి కొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి బాగుంటుందని ఈ తతంగాన్ని 2004 నుంచి మనదేశం లో ప్రవేశపెట్టారు.20 వ శతాబ్దం మొదటిలోనే ఆస్ట్రేలియా వాళ్ళు ఈ పద్దతిని వాళ్ళ దేశం లో మొదలు పెట్టారు.అయితే దుస్టులైన ఇంకా వాళ్ళకి నచ్చని పొలిటీషియన్ ల పేర్లని కోడ్ రూపం లో పెట్టేవారు.అమెరికా వాతావరణవేత్తలు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వాళ్ళ ప్రియురాళ్ళ పేర్లు పెట్టేవారు.Click here

No comments:

Post a Comment