Showing posts with label మానవీయ కధనాలు. Show all posts
Showing posts with label మానవీయ కధనాలు. Show all posts

Saturday 2 September 2017

ఆ రచయిత ని ముప్పతిప్పలు పెడుతున్న జార్ఖండ్ వాసులు..


హన్స్ దా సౌవేంద్ర శేఖర్ (34) జార్ఖండ్ లోని పకూర్ జిల్లా లో బేల్ దంగా అనే బ్లాక్ లో ప్రభుత్వ వైద్యుని గా పనిచేస్తున్నారు.దానితో పాటు ఈయన రచయిత కూడా.ద ఆదివాసి విల్ నాట్ డాన్స్ అనే కధల సంపుటిని రెండేళ్ళ క్రితం వెలువరించాడు.ఈ ఆంగ్ల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం కూడా దక్కింది అంతేకాదు హిందూ పేపర్ దీనికి ఉత్తమ ఫిక్షన్ కి ఇచ్చే పురస్కారం ఇచ్చింది.అయితే ఈ పుస్తకం ఇటీవల హిందీ భాష లో అనువాదం కావడం తో చదివిన జార్ఖండ్ వాసులు చాలామంది ఆగ్రహం తో ఊగిపోతున్నారు. సంతాలీ ఆదివాసి స్త్రీలని అవమానించే విధంగా వర్ణనలు ఉన్నాయని ఇంకా స్థానిక నాయకులైన వారిని చిన్నబుచ్చే కొన్ని కధలున్నాయని అంటున్నారు.జార్ఖండ్ రాష్ట్ర విముక్తి కై పోరాడిన నిర్మల్ మహతో పేరు ని ఒక దుష్ట పాత్రకి పెట్టారని ,ఆదివాసి దేవుళ్ళని,సంస్కృతిని కించపరిచే విధంగా ఈ పుస్తకం ఉందని కనుక సెప్టెంబర్ 4 లోపు ఈ పుస్తకానికి సంబందించిన అన్ని కాపీల్ని తగలబెట్టాలని వివిధ సంఘాలు పిలుపునిచ్చాయి.

అయితే హన్స్ దా ని సమర్దిస్తూ కొంతమంది మేధావులు సంతకాల సేకరణ చేస్తున్నారు. ఫేస్ బుక్ , ట్విట్టర్ ల లో దుమ్మెత్తి పోసుకుంటూ మొత్తానికి ఈ రచయిత కి పెద్ద పబ్లిసిటీ నే చేస్తున్నారు.ఈ రోజు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు భోగట్టా.అయితే ఈ రచయిత కూడా సంతాలీ తెగ కి చెందిన వారే.అదీ కొసమెరుపు.   

Sunday 28 May 2017

సుదర్శన్ పట్నాయక్ ...ఈ ఒక్క పేరు చాలు.



సుదర్శన్ పట్నాయక్ ...ఈ ఒక్క పేరు చాలు.సైకత కళ కి మన దేశం లో పర్యాయపదం ఆయన పేరు.జాతీయ,అంతర్జాతీయ ప్రాముఖ్యత గల రోజులను భావ యుక్తం గా ఇసుక లో శిల్పాలు గా మార్చి మనల్ని అలరించే వ్యక్తి ఆయన.అసలు ఆ రంగం ని ఎందుకు ఎలా ఎంచుకున్నారో సుదర్శన్ ఒక పత్రిక కి ఇటీవలనే చెప్పారు.ఆయన చిన్నతనం లో తండ్రి ని కోల్పోయారు ,బామ్మ పెన్షన్ తో చిన్నప్పుడు కుటుంబం అంతా గడిచేది.అది సరిపోక పక్క ఇంట్లో పనిమనిషి గా పనిచేశాడు.ఖాళీ గా ఉన్నప్పుడు తను పుట్టిన ఆ పూరి పట్టణం లోని బీచ్ కి వెళ్ళి ఇసుక తో రకరకాల గూళ్ళు నిర్మించేవాడు.ఇది కేవలం ఆర్ట్ మీద ఉన్న తనకున్న ఇష్టం తోనే చేశేవాడు.తప్ప ఎలాంటి ప్రతిఫలం కోసం కాదు.

ఒకసారి తను నిర్మించిన ఇసుక శిల్పాల్న్ని చూసిన విదేశీయులు అతడిని అభినందించారు.దానితో ఆసక్తి పెరిగి దానిని కొనసాగించాడు.రమారమి అయిదు ఏళ్ళు అలాగే పైసా ఆదాయం లేకుండా రోజు అలాంటివి బీచ్ లో నిర్మించేవాడు.ఇట్లా ఇసుక లో వేసేవి కొట్టుకుపోయేవి యే గదా..దీనివల్ల ఏం ప్రయోజనం అని కొంతమంది విమర్శించేవాళ్ళు.కాని ఎందుకనో అది తప్పనిపించేది..మనిషి జీవితం కూడా ఏదో ఒకరోజు పోయేదే అలా అని జీవించడం మానేస్తున్నామా.. అనిపించేది.కొన్నాళ్ళకి చూసే వాళ్ళు పెరిగారు.తన శైలిని ఇంకా మార్చుకొని రకరకాల ప్రయోగాలు ఆ ఇసుక లోనే చేశాడు.

బెర్లిన్ లో జరిగిన అంతర్జాతీయ సైకత పోటీ లో గోల్ మెడల్ వచ్చిన తర్వాత దేశ విదేశాల్లో అతని పేరు మారుమోగింది.ఆ తర్వాత ఒకటా రెండా ఎన్నో పోటీల్లో ఫాల్గొని సైకత కళ కి మన దేశం లో పర్యాయపదం గా మారాడు.పెద్ద గా చదువుకోని ఒక నాటి బాల కార్మికుడు ఈ కళ ద్వారా నే పద్మశ్రీ ఇంకా డాక్టరేట్లు పొందాడు.పట్టు విడువకుండా తన హృదయం చెప్పే పనిని చేసేవారికి గొప్పదనం వెదుక్కుంటూ వస్తుందనడానికి పట్నాయక్ జీవితమే ఓ ఉదాహరణ.ఒడియా ప్రజలు తమ కళా ప్రతినిది గా ఈయనని ఎంతో అభిమానిస్తారు. 

Saturday 11 February 2017

ఈ సినిమా పిచ్చి అవసరం అయినదాని కంటే చాలా ఎక్కువ.



సోనం వాంగ్ చుక్ (Sonam Wangchuk) అంటే ఎవరు..అని ప్రశ్నించవచ్చు.కాని రాజ్ కుమార్ హిరాని త్రీ ఇడియట్స్ సినిమా  లో ఫున్సుక్ వాంగ్ డు పాత్ర పెట్టడానికి కారణం ఈయనే అని తెలిస్తే పని ఈజీ అవుతుంది. అందరికి మల్లేనే ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళాడు.ఆ తర్వాత తన రూటు తెలుసుకొని తమ ప్రాంతం లడక్ వచ్చేశాడు.ప్రపంచం లోని ఎత్తైన ప్రదేశాల్లో అది ఒకటి.విపరీతమైన చలి.సరైన సదుపాయాలు రవాణా పరంగా లేకపొయినా టూరిస్ట్ లు మొండి కోరిక వల్ల రాగలుగుతున్నారు.ఇంకా అక్కడి సమస్యలు ..ఎన్నో అవి తమ లాంటి వారే తీర్చుకోవాలి.తమ ప్రాంతం గూర్చి తమ కంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు.ఏప్రిల్,మే నెలల్లో అక్కడ హిమం అంతా నీళ్ళ సమస్య ఏర్పడుతుంది.దానికి గాను వాంగ్ చుక్ హీమ స్తూపాలు నిర్మించడం మొదలు పెట్టాడు.అలా నీటిని వాడుకోవడాన్ని తెలివి గా కొనసాగిస్తున్నారు.అలానే సోలార్ సిస్టం ద్వారా మొత్తం లడక్ ని వెలిగిస్తున్నారు.పర్వత ప్రాంతాల్లోని ప్రత్యేక సమస్యల్ని అధ్యయనం చేసి వాటికి సొల్యూషన్లు కనిపెట్టడానికి ఒక యూనివర్శిటి ని పెట్టాడు.దాని పేరు హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అల్టర్నేటివ్స్ ,ఫ్యూచర్ యూనివర్సిటి అని ముద్దు పేరు.ప్రపంచ వ్యాప్తం గా ఎంతో గుర్తింపు వచ్చింది.మన సిలబస్ లు మన ప్రాంత సమస్యల మీద పరిష్కారాలు చూపే విధంగా ఉండాలి తప్ప ఇంకో దేశం నుంచి అరువు తెచ్చుకోకూడదు.అవి ఎంత గొప్పవైనా ..అంటున్నాడు ఈ మేధావి.

మీ నుంచి ఇన్స్పిరేషన్ పొంది సినిమా తీశారు గదా అని అడిగితే మన భారతీయులకి ఈ సినిమా పిచ్చి అవసరం అయినదాని కంటే చాలా ఎక్కువ.దానిని పెద్ద గా పట్టించుకోను అంటాడు వాంగ్ చుక్.విరాళాలు ఓ మంచి పనికి ఇచ్చే సంస్కృతి మన వద్ద రావలసినంత రాలేదు.మూఢ నమ్మకాల పేరు మీద అందినంత ఇస్తుంటారు తప్ప విజ్ఞాన జ్యుతులు వెలిగించడానికి మాత్రం చేతులు రావు అంటాడు.

Thursday 18 August 2016

ఆదివాసీ ల పై పరిశోధన చేసిన విదేశీయునికి నివాళి ఈ రూపం లో....



బ్రిటన్ కి చెందిన ఆంత్రోపాలజిస్ట్ ఇంకా భారతీయ ఆదివాసీల జానపద కధలపై పరిశోధన చేసిన వెరియర్ ఎల్విన్ ని ఒక ఎనిమేషన్ పాత్ర గా సృష్టించి ఆ వ్యక్తి చేత వివిధ రాష్ట్రాల కి చెందిన గిరిజన సంస్కృతి లో ఉన్న కధలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు వివిధ రాష్ట్రాలకి చెందిన ఆదివాసి యువకులు. జార్ఖండ్,ఒడిస్సా ,అస్సాం,అరుణాచల్ ప్రదేశ్ ,మేఘాలయా లకి చెందిన వీరంతా భువనేశ్వర్ లోని సెంచూరియన్ యూనివర్శిటి లో జరుగుతున్న వర్క్ షాప్ లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.బ్రిటన్ లోని ఆదివాసి ఆర్ట్స్ ట్రస్ట్ అనే సంస్థ దీనికి సహాయపడుతున్నది.మధ్య ప్రదేశ్ లోని మంఝూర్ ఝలి కధలు,అరుణాచల్ ప్రదేశ్ లోని అబోటిని కధలు,నాగా లాండ్ లోని మేన్ టైగర్ స్పిరిట్ కధలు ,మణి పూర్ లోని తప్త కధలు,సిక్కిం లోని నై మకాల్ క్యొయంగ్ కధలు నిక్షిప్తం చేసి సి.డి లు ద్వారా విడుదల చేస్తారు.ఈశాన్య మరియు మధ్య భారత ఆదివాసి తెగల పై విస్త్రుతంగా పరిశోధనలు చేసిన వెరియర్ ఎల్విన్ ని వీటన్నిటిని వివరించే ఎనిమేటర్ పాత్ర గా సృష్టించి ఆయనకి అంజలి ఘటిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ తారా డగ్లస్ తెలిపారు.



Sunday 24 July 2016

"పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మా జాతీయ కవి ని అవమానించింది."



ఈ నెల 13 వ తేదీన నేపాలీ జాతీయ కవి గా గౌరవింపబడే భానుభక్త ఆచార్య యొక్క 202 వ జయంతి వేడుకలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జరిపిందని దానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ,గవర్నర్ కేసరి నాధ్ త్రిపాఠి  తో పాటుగా మమతా బెనర్జీ హాజరయ్యారని కాని గూర్ఖా ప్రతినిధుల్ని ఒక్కర్ని కూడా వేదిక మీదికి పిలవకపోవడం తమ జాతి కి తీరని అవమానంగా భావిస్తున్నామని GTA ప్రధాన కార్యనిర్వహణాధికారి బిమల్ గురుంగ్ ఆరోపించారు.దానికి నిరసనగా నిన్న శనివారం డార్జిలింగ్ లోని గూర్ఖా రంగ్ మంచ్ భవనం లో ఆ కవి జయంతి వేడుకల్ని ప్రత్యేకంగా జరిపారు.నేపాలీ సాహిత్య సమ్మేళన్ అధ్యక్షుడు జీవన్ నాం డాంగ్ మాట్లాడుతూ జూలై 13 న ఆ కార్యక్రమాన్ని టి.వి. లో ప్రసారం చేసినపుడు చూడగా దాన్ని ఆసాంతమూ ఇంగ్లీష్ భాష లో నిర్వహించారని,అందుకు తమకు అభ్యంతరం లేదు గాని తమ భాష లోకి దాన్ని అనువదించకపోవడం దారుణమని అన్నారు.జాయ్ కాక్టస్ మాట్లాడుతూ గూర్ఖాల్ని విభజించాలని బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.వివిధ సాంస్కృతికోత్సవాలు ఈ వేదిక పై జరిగాయి.

Friday 15 April 2016

కొత్త రకం పుచ్చకాయల తో ముందుకు వస్తున్న ముగ్గురు యువకులు

యాపిల్ మెలోన్

తూర్పు గోదావరి జిల్లా లోని గొల్లప్రోలు కి చెందిన వీరబాబు,విశాఖ పట్నం కి చెందిన ప్రసాద్,విజయనగరం కి చెందిన ప్రసన్నకుమార్  వీళ్ళ ముగ్గురు కి విన్నూత్నమైన  ఆలోచన వచ్చింది.వచ్చిందే తడవుగా మిత్రులు ముగ్గురు ఉద్యోగాల్ని వదిలి పెట్టి కార్య రంగం లోకి దూకారు.యాపిల్ మెలోన్ ,ఎల్లో కింగ్,ఎల్లో క్వీన్ అనే పుచ్చ కాయల్లోని వెరైటీల్ని పండిస్తున్నారు.వీటి విత్తనాల్ని  తైవాన్  నుంచి తెప్పించుకున్నారు.చిన్న జగ్గం పేట దగ్గర 19 ఎకరాల భూమిని లీజ్ కి తీసుకొని సేద్యం మొదలెట్టారు.అవి మాత్రమే కాకుండా పైనేపిల్,అరటి,టమాట,బొప్పాస ఇలా రకరకాల పంటల్ని వేశారు.మధ్యవర్తులు ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా సూపర్ మార్కెట్ లకి,మాల్స్ కి సరఫరా చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.భవిష్యత్ లో ఇతర ప్రాంతాల్లో కి సైతం విస్తరించాలని ఉందని మీడియా కి తెలిపారు.

Sunday 10 April 2016

అసలు ఇలాంటివి మన దేశం లోనే బాగా అవసరం కదూ..!



ఇళ్ళు లేని వారు ఇంకా రోడ్ల పక్కన తల దాచుకునే వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో లో నూ ఉన్నారు..మరి వీరంతా టాయిలెట్ గాని బాత్ రూం కి గాని వెళ్ళాలంటే ప్రభుత్వం నడిపేవి కూడా తక్కువ గా ఉన్నాయి. ఈ విషయం గమనించి Doniece Sandoval అనే ఆమె ఆ అవసరాలు తీర్చడానికి సంచార వాహనాల్ని ప్రవేశపెట్టింది.పాడయి మూలనబడ్డ బసుల్ని కొని దానిని రీ మోడల్ చేసింది.పొద్దుటే అవసరం ఉన్న సెంటర్ లకి వెళ్ళిపోతాయి ఈ బస్ లు.చిన్నా పెద్దా ముసలి ముతకా ఎవరికి అవసరం ఉంటే వారు వీటి దగ్గరకి వచ్చి తమ పని కానిచ్చుకుంటారు.సబ్బులు,షాంపులు,టవళ్ళు ఇలా సౌకర్యాలన్ని భేషుగ్గా ఉంటాయి.ఓ కొత్త సాక్స్ జత కూడా ఇస్తారు.డిగ్నిటిగా జీవించడం ,మానవ కనీస అవసరాలు తీర్చుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అంటున్నది Doniece  . జులై 2014 లో ఒక బస్ తో ఆరంభించి క్రమేపి బస్ ల సంఖయని పెంచుకుంటూ వెళ్ళింది.  ఈ కార్యక్రమానికి 75 వేలు డాలర్లు పై చిలుకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించింది.ఇలాంటి బసులు  మన దేశం లో కూడా బావుంటుంది కదూ..!

  

Thursday 10 March 2016

ఎల్లోరా గుహల్లోని చిత్రాల్ని కొన్ని వందల ఏళ్ళు గా కాపాడుతున్న పదార్థమిదే..!



దాదాపుగా 1500 ఏళ్ళు గా ఎల్లోరా గుహల్లోని వర్ణచిత్రాలు పాడయిపోకుండా కాపాడుతున్న పదార్థాల రహస్యాన్ని ఇటీవల పరిశోధకులు కనుగొన్నారు.దేవగిరి ని పాలించిన యాదవ రాజుల హయాం లో ఈ గుహలు తొలచబడ్డాయి.మట్టి కి,లైం ప్లాస్టర్ లాంటి పదార్ధానికి గంజాయి మొక్కల నుంచి తీసిన రసాయనాన్ని దట్టించి ఆ గుహల్లో పూయడం వల్లనే అవి ఇంతకాలం పాటు పాడవకుండా ఉన్నాయి అని ASI మాజీ ఉన్నతాధికారి రాజ్ దేవ్ అంటున్నారు..ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా తీసిన స్కానింగ్ లో కూడా ఈ సంగతి వెల్లడయింది.ఎల్లోరా గుహల్లో లభ్యమైన నమూనాల్ని ఢిల్లీ ఇంకా జల్నా వద్ద పండే గంజా తో పోల్చినప్పుడు అవి సరిగ్గా సరిపోయినాయని వెల్లడించారు.అయితే అజంతా గుహల్లో ఈ లేపనాన్ని పూయకపోవడం వల్లనే అవి చాలా భాగం దెబ్బతిన్నాయని చెబుతున్నారు.

Thursday 4 February 2016

డార్జిలింగ్ నుంచి ఓ విన్నూత్న ఫేషన్ డిజైనర్..!



షైరీన్ భట్ ఓ వేపు మోడల్ గా,ఫేషన్ డిజైనర్ గా ఇంకా టాట్టూ ఆర్టిస్ట్ గా రాణిస్తూ డార్జిలింగ్ కి ప్రత్యేక ప్రాతినిధ్యం వహిస్తున్నది.తండ్రి సలీం భట్ పురాతత్వ వస్తువుల్ని అమ్మే వ్యాపారం చేస్తూంటాడు. రానున్న ఐదేళ్ళలో తనవైన బ్రాండ్ వస్తువుల్ని ప్రమోట్ చేస్తూ ఓ టాట్టూ స్టూడియో కూడా తెరవాలని ఆమె ఆకాంక్ష.హిమాలయన్ నర్సరీ స్కూల్ లోను,బేతనీ స్కూల్ లోను విద్య పూర్తి చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫేషన్ టెక్నాలజీ లో డిగ్రీ పూర్తి చేసింది.Click 

Tuesday 12 January 2016

140 మిలియన్ల రికార్డ్ లు అమ్ముడు చేయగలిగాడు.



విఖ్యాత పాప్ సంగీతకారుడు ,బ్రిటిష్ మ్యూజిక్ లెజెండ్ David Bowie తన 69 వ ఏట గత సోమ వారం కాన్సర్ తోమరణించాడు.గీత రచయిత గా ,కంపోజర్ గా,అరేంజర్ గా ,సింగర్ గాఇలా ఎన్నో విధాలు గా పేరు పొందాడు.తాను చనిపోవడానికి ముందు శుక్ర వారం రోజున తన చివరి ఆల్బం Blackstar ని రిలీజ్ చేశాడు.Glam rock,New Romantic,Dance Rock, ల నుంచి Alternative Rock, ,Jungle,Soul,Hard Rock, ల దాకా తనదైన శైలి లో ముద్ర వేశాడు.అతను జన్మించిన Brixton (దక్షిణ లండన్) లో వీధి గోడల పై న అతని బొమ్మలకి పూవులు వేసి నివాళులు అర్పించారు.డేవిడ్ స్కూల్లో చదివింది తక్కువే గాని సృజనాత్మకత తో చాలా రికార్డు లు సాధించాడు.ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్ల రికార్డ్ లు అమ్ముడు చేయగలిగాడు.దానిలో Let's dance అనేది బాగా అమ్ముడైంది.

అంతరిక్షం లో మరణించిన మేజర్ టాం అనే వ్యోమ గామి కి Space oddity అనే ఆల్బం ని 1969 లో అంకితమిచ్చాడు.రోలింగ్ స్టోన్స్,మడోన్నా ఇంకా ఇతర పాప్ ప్రముఖులు అతనికి నివాళులు అర్పించారు.1947 లో డేవిడ్ రాబర్ట్ జోన్స్  గా జన్మించిన అతను  అప్పటికే ఆ పేరు తో మరొక సింగర్ ఉండటం తో డేవిడ్ బోవీ గా మార్చుకున్నాడు.
"His music played a very strong part in British musical history and I am proud to think of the huge influence  he has had on people all around the world" -Paul McCartney (Ex-Beatles)

Wednesday 28 October 2015

పావ్లో కొయొలో (Paulo Coelho) ఇప్పటికే తెలుగు పాఠకులకి కూడా..!



పావ్లో కొయొలో (Paulo Coelho) ఇప్పటికే తెలుగు పాఠకులకి కూడా బాగా పరిచయస్తుడు తన అల్కెమిస్ట్ వంటి పాపులర్ నవలల మూలంగా,అయితే ఆయన మొత్తం 24 నవలలు రాశారు.స్వతహాగా పోర్చ్ గీస్ భాష లో రాస్తే దానిని ఇంగ్లీష్ లోకి అనువదిస్తారు.1987 లో అల్కెమిస్ట్ రాసినపుడు మొదట్లో ఎవరూ దాన్ని పట్టించుకోలేదు.అయితే 1990 లో దాన్ని ఫ్రెంచ్ భాష లో అనువదించడం తో పావ్లో పేరు మారుమోగింది.ఈ రచన 80 భాషల్లోకి అనువదింపబడి మూడున్నర కోట్ల పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయింది.24 ఆగష్ట్ 1947 లో పుట్టిన పావ్లో రకరకాల చిన్న చిన్న వృత్తులు చేశాడు.యవ్వన కాలం లో నే పిచ్చాసుపత్రి లో చేర్పించబడ్డాడు.1970 లో హిప్పి తరహా జీవితానికి లోవయ్యాడు.స్పెయిన్ లో 500 మైళ్ళు నడిచి ఓ క్రైస్తవ క్షేత్రానికి  చేరుకొని దాని ఆధారంగా పిలిగ్రిమేజ్ అనే పుస్తకం రాశాడు.నేను దేన్నైనా నాకు సంతృప్తి కలిగేలా మాత్రమే రాసుకుంటాను.ఇతరులకు నచ్చడం ,నచ్చకపోవడం అనేది నాకు సంబందించని అంశం అంటాడాయన.Click here    

Sunday 27 September 2015

వస్త్రాలు లాండ్రికి వేసినట్టే మనం వేసుకునే షూస్ ని కూడా లాండ్రి వేయవచ్చు



వస్త్రాలు లాండ్రికి వేసినట్టే మనం వేసుకునే షూస్ ని కూడా లాండ్రి వేయవచ్చు.మళ్ళీ నిగ నిగ లాడేలా చేసుకోవచ్చు.దానికి పట్టిన దుమ్ముని,వాసనని శుభ్రం చేసి చక్కగా మళ్ళీ ధరించవచ్చు.సందీప్ గజకాస్ అనే వ్యక్తి ముంబాయి లో ఇలాంటి షాప్ ని ఈ మధ్య తెరవగా దాని స్ఫూర్తి తోనే  ఇప్పుడు ఒడిస్సా లోని భుబనేశ్వర్ లో  శాంతి భూషణ్ నాయక్ (35) అనే ఎంసిఏ చదివిన యువకుడు రివైవ్ షూ షాప్ ని ప్రారంభించాడు.నిజానికి ముంబాయి లోని సందీప్ నుంచి ఫ్రాంచిజ్ పొందాలనుకున్నాడు.కాని అతను చెప్పిన రేట్లు తనకి గిట్టుబాటు కావని తోచి తానే రెండు లక్షల పెట్టుబడితో షాప్ తెరిచాడు ఇంకో మిత్రునితో కలిసి..!

ఇంటర్నెట్ ద్వారా కొన్ని టెక్నిక్ లి నేర్చుకున్నాడు.అలాగే ఢిల్లీ వెళ్ళి ఓ వారం రోజులుపాటు  శిక్షణ పొందాడు.చెప్పు లేదా షూ కి పట్టిన దుమ్ము ధూళిని,వాసన ని తొలగించడానికి తన వైన చిట్కాల్ని కూడా ఉపయోగిస్తాడు.ప్రస్తుతం కార్పోరేట్ లు కూడా  200 నుంచి 300 జతల్ని ఇస్తుంటారు.మొదటిలో కొంతమంది తెలిసిన వారు మాత్రమే ఇచ్చేవారు.పోను పోను గిరాకి పెరగసాగింది.ఇంకో ముగ్గురు కుర్రాళ్ళని పెట్టుకున్నాడు.అన్ని ఖర్చులు పోను నలభై వేల దాకా వస్తున్నాయి.బిజినెస్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నాడు నాయక్.

Wednesday 8 July 2015

రోబోల గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!




Robot అంటే ఏమిటి..?

Robot అనే మాటకి అర్ధం మనిషి చేత తయారు చేయబడిన యంత్రం అని..!మనిషి చేసే పనులను,ఇతరములను చేయగలిగి ఉంటుందది.దీనిలో కొన్ని రిమోట్ చేత పని చేసేవి...మరికొన్ని ఆటోమేటిగ్గా పనిచేసేవి.కొన్ని Robot లు మనుషులు మాదిరిగాను,కొన్ని జంతువులు గాను ఇంకొన్ని చాలా చాలా చిన్నగా కూడా ఉండవచ్చు.అవి చేసే పనులను బట్టి వాటి ఆకారాలు ఉంటాయి.

Robotics అంటే ఏమిటి..?

Robots గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని Robotics అంటారు.వాటిని డిజైన్ చేయడం ,ఆపరేట్ చేయడం ఇంకా ఇతర అప్లికేషన్లను అంటే కంప్యూటర్ల ద్వారా Robot ల యొక్క Sensory feedback ని తీసుకోవడం..కంట్రోల్ చేయడం వంటివి దీనిలో భాగంగా చెప్పవచ్చును.పరిశ్రమలలో ,పరిశోధనాశాలల్లో ..ఇళ్ళలో వీటి వాడకం పెరుగుతుండటం తో రోబోటిక్స్ శాస్త్రం చాలామందిని నేడు ఆకర్షిస్తోంది.మనుషులు చేయడానికి ప్రమాదకరంగా ఉండే కొన్ని పనులను చేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు.ఉదాహరణకి బాంబుల్ని డిఫ్యూజ్ చేయడం,గ్యాస్ ట్యాంకుల్లో,అగ్ని పర్వతాల్లో,గనుల్లో ప్రమాదకరమైన పనులు చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.అంగారక గ్రహం పైకి కూడా Robot లని పంపించి కొన్ని పరిశోధనలకి ఉపయోగించడం జరిగింది.

Robot అనే మాట ఎక్కడ ఉద్భవించింది..?



ఈ మాట చెక్ భాష నుంచి పుట్టింది.ఆ దేశానికి చెందిన Karel Capek అనే రచయిత 1921 లో తను రాసిన Rossum's Univerasal Robots నాటకం లో ఈ పదాన్ని మొదటిగా వాడాడు.ఈ నాటకం లో జీవ,భౌతిక,రసాయన శాస్త్రాల్లో పరిణితి సాధించిన ఓ శాస్త్రవేత్తల బృందం అన్నిపనులు చేయగలిగిన రోబో లని తయారు చేస్తారు.అయితే వాటికి ఆత్మ ఉండదు..అంతే తేడా..!దాంట్లో తెలివి మీరిన రెండు రోబోలు మాత్రం తమని సృష్టించిన శాస్త్రవేత్తలనే చంపబోతాయి.అంతలో మరో మంచి రోబో శాస్త్రవేత్తల్ని ఆదుకుంటుంది.ఆ నాటకం ఆ రోజుల్లో మంచి పాపులారిటి సాధించింది.ఆ తర్వాత సైన్స్ ఫిక్షన్ లో రోబో  లు ప్రధాన పాత్రగా మారి పోయాయి. (సశేషం) Click