విఖ్యాత పాప్ సంగీతకారుడు ,బ్రిటిష్ మ్యూజిక్ లెజెండ్ David Bowie తన 69 వ ఏట గత సోమ వారం కాన్సర్ తోమరణించాడు.గీత రచయిత గా ,కంపోజర్ గా,అరేంజర్ గా ,సింగర్ గాఇలా ఎన్నో విధాలు గా పేరు పొందాడు.తాను చనిపోవడానికి ముందు శుక్ర వారం రోజున తన చివరి ఆల్బం Blackstar ని రిలీజ్ చేశాడు.Glam rock,New Romantic,Dance Rock, ల నుంచి Alternative Rock, ,Jungle,Soul,Hard Rock, ల దాకా తనదైన శైలి లో ముద్ర వేశాడు.అతను జన్మించిన Brixton (దక్షిణ లండన్) లో వీధి గోడల పై న అతని బొమ్మలకి పూవులు వేసి నివాళులు అర్పించారు.డేవిడ్ స్కూల్లో చదివింది తక్కువే గాని సృజనాత్మకత తో చాలా రికార్డు లు సాధించాడు.ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్ల రికార్డ్ లు అమ్ముడు చేయగలిగాడు.దానిలో Let's dance అనేది బాగా అమ్ముడైంది.
అంతరిక్షం లో మరణించిన మేజర్ టాం అనే వ్యోమ గామి కి Space oddity అనే ఆల్బం ని 1969 లో అంకితమిచ్చాడు.రోలింగ్ స్టోన్స్,మడోన్నా ఇంకా ఇతర పాప్ ప్రముఖులు అతనికి నివాళులు అర్పించారు.1947 లో డేవిడ్ రాబర్ట్ జోన్స్ గా జన్మించిన అతను అప్పటికే ఆ పేరు తో మరొక సింగర్ ఉండటం తో డేవిడ్ బోవీ గా మార్చుకున్నాడు.
"His music played a very strong part in British musical history and I am proud to think of the huge influence he has had on people all around the world" -Paul McCartney (Ex-Beatles)
No comments:
Post a Comment