Showing posts with label పుస్తక పరిచయం. Show all posts
Showing posts with label పుస్తక పరిచయం. Show all posts

Saturday 12 August 2023

" కోరాపుట్ అండ్ అదర్ షార్ట్ స్టోరీస్" ఓ విశిష్టమైన కథా సంపుటి.

 "కోరాపుట్ అండ్ అదర్ షార్ట్ స్టోరీస్" అనే ఈ కథాసంపుటి 15 విశిష్టమైన కథల తో నిండి ఉన్న పుస్తకం. గౌరహరి దాస్ గారు వీటిని ఒరియా భాషలో రాయగా సరోజ్ మిశ్రా,గోపా నాయక్ లు ఇంగ్లీష్ లోకి అనువదించారు. గౌరహరి దాస్ గారు ఒరియా భాష లో పేరు ప్రఖ్యాతులున్న పత్రికా సంపాదకులు మరియు రచయిత కూడా. అంతేకాదు మంచి నాటకరచయిత గా తనదైన ముద్ర వేశారు ఒరియా సాహితీ లోకంలో..! అటువంటి రచయిత యొక్క కథల్ని ఇంగ్లీష్ లోకి అనువదించడం వల్ల మనం అందరం చదివే అవకాశం కలిగింది. గతం లో కూడా ద లిటిల్ మాంక్ అండ్ అదర్ స్టోరీస్ పేరుతో ఓ కథాసంపుటి వెలువడింది. అది గౌరహరి దాస్ కథలు అనే పేరు తో తెలుగు లోకి కూడా అనువాదమై మంచి ఆదరణ పొందింది.  

ఈ పుస్తకం లోని ఆంగ్ల భాష చాలా సులువుగా ఉండటం వల్ల చదువరులు పెద్దగా కష్టపడనవసరం లేదు. మూల రచయిత భావం స్పష్టం గా అర్థమై ముందుకు వెళతాడు చదువరి. ఈ పుస్తకం లోని మొదటి కథ కోరాపుట్ నేపథ్యం లో సాగుతుంది. ఒరిస్సా లోని కోరాపుట్ ని ఒక్కసారైనా సందర్శించాలని కోరిక పుడుతుంది ఇది చదివినతర్వాత..! నిజానికి ఈ కథ తీవ్రవాద నేపథ్యం ని నింపుకుని అక్కడి స్థితిగతుల్ని, సాంఘిక వ్యవస్థ ని మనముందు నిలుపుతుంది. కోరాపుట్ ఒడిలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.

Once the sky was blue ఏఅ కథ ఈనాటి మాల్ సంస్కృతిని కళ్ళకి కడుతుంది. ఏ విధంగా చిన్న చిన్న వ్యాపారులు బడా మాల్స్ వల్ల నలిగిపోతారు అనేది చూపిస్తుంది. తలవంచడానికి ఇష్టపడని చిన్న వ్యాపారుల్ని ఎలా తమ ఆర్ధిక,అంగ బలాలతో చిదిమివేస్తారో ఈ కథ లో చదవవచ్చు. Mirage అనే కథ లో పన్నా జెనా అనే ఆకురౌడి జీవితాన్ని రమ్యం గా చిత్రించారు. ఏ బలాలకి లొంగని పొగరుబోతు ని ఏ విధంగా స్త్రీ ని ఉపయోగించి మట్టి గరిపించారో ఈ కథలో చదవవచ్చు. 

ఇక మీడియా రంగం లో వస్తోన్న మార్పులు గురించి ఓ కథ లో వివరించారు. విదేశీ పెట్టుబడులు పత్రికారంగం లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో చాలా విపులంగా తెలుసుకోవచ్చు.ఇలాంటి ఇతివృత్తాలతో కథ రాయడానికి చాలా ధైర్యం కావాలి.అంతేగాక బంగ్లాదేశ్ నుంచి బతకడానికి వచ్చిన కుటుంబం గురించి ఓ కథ లో చదవవచ్చు.విన్నూత్న అంశాలు ఈ సంపుటి లో గోచరిస్తాయి. కావలసినవారు అమెజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. 

Sunday 12 March 2023

ప్రఖ్యాత రచయిత రస్కిన్ బాండ్ అభిమానుల్ని అక్కడ మాత్రమే ఎందుకు కలుస్తారో తెలుసా..?


 రస్కిన్ బాండ్ (Ruskin Bond) ఈ పేరు వినని సాహితీప్రియులు ఉండరు. ఆయన స్వతహాగా ఆంగ్లం లో రాసినప్పటికీ ఇంచుమించు అన్ని భారతీయ భాషల్లోకి వారి రచనలు అనువాదాలు జరిగాయి,జరుగుతూనే ఉంటాయి.ఇంగ్లీష్ పాఠ్యగ్రంథం లో ఎక్కడో ఓ చోట బాండ్ ఒక్క కథనో ,వ్యాసమో చదివే ఉంటాము.ఇక CBSE,ICSE సిలబస్ లు చదివి వచ్చిన యువత గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన రాసిన అనేక కథల పుస్తకాల్ని చదువుకుంటూ పోతూనే ఉంటారు.జీవితం లో ఒక భాగమై ఆయన పేరు మీద అనేక గ్రూపులు ఆన్ లైన్ లో నడుపుతుంటారు.ఈ మేగజైన్ కూడ ఉంది. కథ ని ప్రేమించే మనిషికి ఆయన కథ తగిలితే చాలు ఇక అక్కడితో ఆగలేరు.

మరి ఇంతా చేసి ఈ రస్కిన్ బాండ్ ఎవరు..?చిన్నపిల్లలు,యువతరం,పెద్దతరం అందరినీ తనదైన ప్రత్యేక కథన కుతూహలం తో అలరించే ఈయన ముస్సోరి అనే పట్టణం లో ,హిమాలయ సానువుల్లో ,ఆ కొండల్లో ఎన్నో దశాబ్దాల నుంచి జీవిస్తూ అక్కడి తన అనుభవాలనే గాక ఇంకా తన జీవితం లోని ఎన్నో అనుభవాలను కథల రూపం లో రాస్తూ ఇప్పటికీ 100 పుస్తకాల కి పైగా వెలువరించాడు. ప్రస్తుతం ఎనభైవ పడి లో ఉన్నాడు. జన్మతహ ఆంగ్లేయ దంపతులకి పుట్టినప్పటికి భారత దేశాన్ని తన ఆవాసం గా చేసుకుని ఇక్కడే ఉండిపోయాడు. తన అసలు పేరు ఓవెన్ రస్కిన్ బాండ్ ,1934 లో హిమాచల్ ప్రదేశ్ లోని కాసులి అనే ఊరి లో జన్మించాడు.

ఆయన చిన్నతనం లోనే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి అప్పటి ఒక భారతీయ సంస్థానాధీశుణ్ణి రెండో వివాహం చేసుకోవడం తో, ఎక్కువగా తండ్రి వద్దనే పెరిగాడు. బ్రిటీష్ ఆర్మీ లో పనిచేసే అతను అనేక ప్రాంతాలు తిరిగేవాడు.బాండ్ కూడా తండ్రి తో పాటూ తిరిగాడు. యవ్వనదశ కి ముందే తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత తనది ఒకరకమైన అనాధ జీవితమే అయింది.స్నేహితుల సాయం తోనూ,చిన్న చిన్న పనుల తోనూ తనని తాను పోషించుకున్నాడు. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తన బంధువులు ,తెలిసిన వాళ్ళు చాలామంది ఇంగ్లండ్ కి వెళ్ళిపోయారు. అయితే తాను మటుకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు.

రచయిత గా మాత్రమే జీవించాలని కంకణం కట్టుకున్నా,అది ఇండియా లో చాలా కష్టమని తెలిసింది.ట్యూషన్స్ చెప్పినా,స్వచ్చంద సంస్థ లో పని చేసినా దానికోసమే. మొత్తానికి రమారమి 70 ఏళ్ళపాటు రచనా రంగం లో ఉండి 100 కథల పుస్తకాల్ని ఇప్పటిదాకా రాశాడు. లెక్కలేనన్ని వ్యాసాలు,ఇతర ప్రక్రియలు చేపట్టాడు.మరి ఇన్నేళ్ళ తన జీవితం లో తాను పొందిన తీపి,చేదు అనుభవాలు అన్నిటినీ కలిపి రస్కిన్ బాండ్ తన ఆత్మకథ ని రాసుకున్నాడు దాని పేరు Lone Fox Dancing రెండువందల ఎనభై పేజీలు. స్పీకింగ్ టైగర్స్ వాళ్ళు ప్రచురించారు. ప్రతి ఒక్క రచయిత లేదా రచయిత కాదలుచుకున్న వ్యక్తి తప్పక చదవాలి. 

ఈ ఆటోబయోగ్రఫీ చదవడం వల్ల మనకి రస్కిన్ బాండ్ యొక్క జీవిత గాథ తెలియడమే కాదు. దానితో బాటు అనేక విషయాలు తెలుస్తాయి. నాటి బ్రిటిష్ ప్రభుత్వం లో పనిచేయడానికి వచ్చిన అనేక రకాల మనుషుల మంచీ చెడు తెలుస్తాయి.వాళ్ళ వ్యామోహాలు,ఉద్యోగధర్మం గా వాళ్ళు చేసిన పనులు, వాటి పర్యవసానాలు తెలుస్తాయి. అంతేకాకుండా స్థానిక ప్రజలతో వాళ్ళ అనుబంధాలు తెలుస్తాయి.ముఖ్యం గా సింలా,డెహ్రాడూన్,జాం నగర్,లక్నో వంటి ప్రాంతాల్లో నాటి నేటివ్ బ్రిటిషర్స్ ఎలా జీవించేవారు,రోజువారి జీవితం లోని పదనిసలు ఇప్పుడు చదువుతుంటే ఆసక్తి గా అనిపిస్తాయి.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలామంది బ్రిటిషర్లు ఇక్కడ ఉండడం లో  ఇన్సెక్యూరిటీ ఫీలయ్యి ఇంగ్లండ్ కి వెళ్ళిపోయారని రస్కిన్ బాండ్ చెబుతాడు. తాను నాలుగు ఏళ్ళు లండన్ వెళ్ళి కొన్ని ఉద్యోగాలు ప్రయత్నించి తనకి ఇండియా నే బాగుందనిపించి మళ్ళీ వెనక్కి వస్తాడు. దానికి కారణం చెబుతూ హిమాలయ సానువుల్లోని ఆ గుట్టల్లోనూ,చెట్ల లోనూ,ఉండి ఉండి అవి నాలో ఓ భాగమయిపోయాయి.ఆ తర్వాత ఢిల్లీ లోనూ ,బొంబాయి లోనూ ఉండాల్సివచ్చినా అది తనవల్లగాదని ముస్సోరి లోనే స్థిరపడ్డాడు.అక్కడ నుంచే తన రచనా యాత్రని సాగించాడు.అప్పటికి ఆ ఊరు చాలా చిన్నది. తన మొట్టమొదటి నవల The Room on the  Roof ఇలస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లో సీరియలైజ్ అయినప్పుడు ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. దాన్ని ఎవరికైనా చూపించి శభాష్ అనిపించుకోవాలన్నా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఆ చుట్టూతా ఎవరూ ఉండరు.

ఢిల్లీ లో ఉన్న కుష్వంత్ సింగ్ తనని ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు ఒకసారి,తన రచనల్ని బాగా ప్రోత్సహించేవాడని రస్కిన్ బాండ్ రాసుకున్నాడు.మెల్లిగా స్వదేశీ,విదేశీ ఇంగ్లీష్ పత్రికల్లో రాయడం మొదలుపెట్టి తనకంటూ ఓ స్థాయి ని సంపాదించుకుంటాడు.ఆ తర్వాత ఇంప్రింట్ అనే పత్రిక కి సహసంపాదకునిగా ఆర్.వి.పండిట్ కోరిక మీద పనిచేశాడు.ఎమర్జెన్సీ టైం లో ఆ పండిట్ మీద అప్పటి ప్రభుత్వానికి ఉన్న కోపం వల్ల ఓ చిన్న కేసు లో ఇరుక్కుంటాడు.అయితే ఈజీగానే దానిలోనుంచి బయటబడి తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగించాడు.

ఇప్పుడు మాదిరిగా అప్పట్లో రచయితలకి పబ్లిసిటీ లేదని,తాను ఓసారి బిబిసి లో ప్రొగ్రాం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గ్రాహం గ్రీన్ తన పక్కనే కూర్చున్నా తాను గుర్తించలేదని ,ఆ తర్వాత ఎవరో తనకి చెప్పడం తో ఖంగుతిన్నానని అంటాడు. అయితే ఎర్నెస్ట్ హెమింగ్వెయ్ లాంటి వాళ్ళు వేరు.పబ్లిసిటీ కోసం ఏవో చేస్తుండేవారని అంటాడు. ఇలా ఎన్నో విషయాల్ని తనకి తారసపడిన సంఘటనల్ని అక్షరబద్ధం చేశాడు. 50 ఫోటోలు ఈ పుస్తకం లో ఉన్నాయి.అవి అన్నీ ఎన్నో నాటి సంగతులని వివరిస్తాయి. ముస్సోరి లో ఉండే రస్కిన్ బాండ్ ని కలవడానికి ఎంతోమంది అభిమానులు వస్తుంటారు.

 అక్కడ ఉండే కేంబ్రిడ్జ్ బుక్ హౌస్ అనే పుస్తకాల షాప్ లో వాళ్ళందర్నీ ప్రతి శుక్రవారం కలుస్తుంటాడు. ఇంట్లో మాత్రం ఎవరినీ కలవడాయన.దానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. బెంగాల్ నుంచి ఓ రచయిత్రి చాన్నాళ్ళ క్రితం ఈయన ఇంటికి వచ్చి తప్పనిసరిగా తన పుస్తకానికి ముందుమాట రాయవలసిందే అని కూర్చుందట. నేను కొద్దిగా పనిలో ఉన్నా ,స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళమంటే నానాయాగీ చేసిందట. సరె...ఎవరి అనుభవాలు వాళ్ళవి. మన ఆర్.కె.నారాయణ్ గారు జీవించి ఉన్న రోజుల్లో అభిమానుల్ని ఇంట్లో కాకుండా బయటనే ఎక్కువ కలిసేవారని చదివాను. అనేక అనుభవాల సమాహారంగా ఉన్న ఈ ఆటోబయోగ్రఫీ ప్రస్తుతం అమెజాన్ లో లభ్యమవుతోంది.

----- మూర్తి కెవివిఎస్      

Thursday 8 December 2022

మధురై నుంచి చిత్తూరు వచ్చిన దేవదాసి కథ

 ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అంటే ఎవరో ఎవరికీ వివరించనవసరం లేదు. శాస్త్రీయ సంగీతం పెద్దగా తెలియనివారికి కూడా ఓహో ఆమె కదూ అంటారు. ఆ ఖంగు మనే గొంతు,మాధుర్యం కలబోసుకున్న త్యాగరాయాది మహామహుల కీర్తనలు గుర్తుకు వస్తాయి.అంతమాత్రమేనా ఐక్యరాజ్యసమితి లోనూ కచేరి ఇచ్చిన ఘనాపాటిగా గౌరవిస్తారు.అలాంటి ఆవిడ జీవితాన్ని గుర్తుకు తెచ్చేలా ఓ గొప్ప నవల ఇటీవల మన తెలుగు లో వచ్చింది. కాకపోతే ఆ పాత్ర పేరు నాగలక్ష్మి ఇంకా ఆమె భర్త పేరు విశ్వనాథన్. ఇంకా ఎన్నో పాత్రలు. ఆ పాత్రలన్నీ చెబుతూండగా ఆ విన్నూత్న తరహా నవల నాలుగువందల పైచిలుకు పేజీల్లో సాగిపోతుంది. "ఆటా " వారు నిర్వహించిన నవలల పోటీల్లో బహుమతిబహుమతి ని కూడా గెల్చుకున్నది.

వదాసీ వ్యవస్థ యొక్క నిజమైన స్వరూపాన్ని కళ్ళముందు చూపెడుతూ అనేక వందల ఏళ్ళ నుంచి వారు ఏ విధంగా సంగీత నృత్యాల్ని కాపాడుకుంటూ వచ్చినదీ ,కాలమహిమ వల్ల వారి వైభవం ఎలా అడుగంటిందీ ఎలా ఒడిదుడుకుల్ని అవమానాల్ని భరించి ముందుకు సాగినదీ ఈ నవల మనకి తెలియబరుస్తుంది. ఇంతకీ ఆ నవల పేరు "మనోధర్మపరాగం" , దీన్ని రాసినవారు మధురాంతకం నరేంద్ర.ఇప్పటికే ఆయన పేరెన్నిక రచయిత అయినప్పటికీ ఈ నవల ద్వారా ఆయన మరో కోణం ని పాఠకులు దర్శిస్తారు.కథ అంతా తమిళనాడు లోని మధురై ఇంకా చెన్నపట్నం లో సాగుతుంది.అలాగే మన చిత్తూరు లో కూడా కొంత భాగం నడుస్తుంది.

గతించిన చరిత్ర లో పేరున్న కులాలు తమ వైభవాన్ని తెలిపే ఎన్నో పుస్తకాలు రాసుకున్నారు.కాని దేవదాసి వ్యవస్థ లో వారికి ఏమాత్రం తీసిపోని ధనవంతులు అయిన స్త్రీలు ఏ విధంగా లలితకళల్ని పోషించారు ఇంకా ఏ విధంగా తమ మాట ని చెల్లించుకుని తమ జీవనాన్ని సాగించారు అనేది ఈ నవల విశదపరుస్తుంది.సమాజం లో వారికి గల హోదా ఏ విధంగా విచ్చిన్నమవుతూ దిగజారిపోయిందీ మనం తెలుసుకోవచ్చు.ఈ నవల లోని నాగలక్ష్మి పాత్ర ప్రఖ్యాత గాయని ఎం.ఎస్ సుబ్బులక్ష్మి ని పోలి ఉంది.ఒక రకంగా కాదు,అనేక రకాలుగా.సామాజిక మార్పులు ఎలా చరిత్ర ని మరుగుపరుస్తాయి అనేది కూడా మనం గమనించవచ్చు.అభిరుచి గల ప్రతి పఠిత తప్పక చదవవలసిన నవల ఈ మనోధర్మపరాగం.

(లభ్యస్థానం: అన్నీ ప్రముఖ పుస్తక కేంద్రాలు, అమెజాన్ తో పాటు.  వెల:రూ.375/-)  

----- NewsPost Desk

Monday 27 September 2021

"యారాడ కొండ" నవల పై ఓ సమీక్ష

 


 నేను ఇటీవల చదివిన నవల యారాడ కొండ. రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు. చదివిన తర్వాత నా అనుభూతిని కొన్ని వాక్యాల్లో పంచుకోవాలనిపించింది. తెలుగు నవల చదివి చాలా కాలమైంది.ఇంగ్లీష్ నవలలు చదువుతూ వాటి మీద ఏదో నాలుగు మాటలు నా బ్లాగు ల్లోనూ,అడపాదడపా పత్రికల్లోనూ రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్న నన్ను యారాడ కొండ వైపు లాక్కెళ్ళింది ఏమిటీ అంటే మూడు అంశాలు.

ఒకటి శ్రీశ్రీ ఆ కొండని కొన్నిమార్లు ఉగ్గడించడం,రెండు ముఖచిత్రం గా ఉన్న కెప్టెన్ జె.టి.బ్లంట్ యొక్క పేయింటింగ్. దీనిమీదట విశాఖ నగర సౌందర్యం పై నాకు గల మోహభావం. వీటిని పట్టుకుని యారాడ కొండ పైకి ఎక్కాను. సముద్రం అంత జీవితాన్ని ఎంతో శ్రద్ధ తో,ప్రేమ తో చిత్రించిన రచయిత అంతరంగాన్ని అవలోకించి ఔరా అనుకుని ఒక్క ఉదుటున నవల మొత్తం చదివేశాను.కాదు..కాదు యారాడ కొండ నే నన్ను తీసుకుపోయింది తనతో..!   

ఇది ఒక జాలరి కుటుంబానికి చెందిన కథ. బ్రిటీష్ వారి పాలన లో మొదలయి ఆ తర్వాత రోజులవరకు అనగా ప్రస్తుత కాలం వరకు సాగిన కథ. దానితో బాటే విశాఖ నగరం కాలం తో బాటు మార్పులకు లోనవుతూ వచ్చిన కథ. మరి అంతమాత్రమేనా..? ఇంకా ఎన్నో ఉన్నాయి..ఆనాటి ఆంగ్లో ఇండియన్లు వారి సామాజిక పరిస్థితుల్ని కెప్టెన్ జిమ్మీ పెరీరా కుటుంబం ద్వారాచూపించారు.మన తెలుగు నవలల్లో ఇంత సావకాశం గా వారి జీవితాల్ని చిత్రణ చేసిన నవల నాకు తెలిసీ బహుశా అతి తక్కువ.

రచయిత కి సముద్రయానం పై గల అనుభవాలు ఈ నవల కి పెద్ద ఎస్సెట్ అని చెప్పవచ్చు. నూకరాజు,ఎల్లమ్మ పాత్రలు వారి బాల్యం...ఆంగ్లో ఇండియన్ ప్రభావం తో ఎదిగిన వైనం మనుషుల మధ్య జీవిత గమనాన్ని ఎలా మార్చుతాయో కళ్ళకి కట్టినట్లు చిత్రించారు. అలాగే వారి మధ్యనుంచే వచ్చిన సిమ్హాచలం బయటి నుంచి వచ్చిన పెట్టుబడిదారులకి తాబేదారుని గా మారిన వైనం నేటి స్థితిగతుల్ని గుర్తు తెప్పిస్తాయి.అప్పల్రాజు పాత్ర రెండు స్వభావాల మధ్య నలిగిపోయిన అభాగ్యుల్ని గుర్తు చేస్తుంది.   

భాస్కర్ పాత్ర ఆ రోజుల్లో ఆదర్శాల కోసం ప్రాణ త్యాగం చేసిన మనుషుల్ని సజీవం గా మనముందు నిలుపుతుంది.వీటన్నిటికీ మించీ విశాఖ అంతర్లీనం గా ప్రతి పాత్ర తోనూ పడుగూ పేక లా కలిసిపోయింది. సెల్వన్,కమల పాత్రలు మనతో ఎన్నో నేటి వాస్తవాల్ని ముచ్చటిస్తాయి. ఇంత ఏలా..?ఎయిర్ పోర్ట్ లో నూకరాజు, ఎం.పి. నాయుడుతో మాట్లాడుతున్నప్పుడు ఒక హేళన ధ్వనించే గొంతు తో అతను ఏకవచనం తో సంభోదించినపుడు తిరిగి అదే విధం గా నూకరాజు కూడా సంభోదించడం ఆత్మగౌరవం అంటే ఏమిటో ఒక సూక్ష్మ విధానం లో తెలియజేశారు.   

 మనం యారాడ కొండ ఎక్కి ఒక దృశ్యకావ్యాన్ని చూస్తాం.చదువుతున్నంత సేపు మైమరపు,చదివిన తర్వాత మనలో ఒక భాగం గా మారిపోవడం ఈ రెండు లక్షణాలు గొప్ప నవలల్లో నేను గమనించినవి. ఈ యారాడ కొండ ఆ కోవ కి చెందినది. ఇంతమంచి నవల ని తెలుగు వారికి అందించిన ఉణుదుర్తి సుధాకర్ గారికి, ఆటా వారికి,అన్విక్షికీ కి అభినందనలు.

ఇటీవల ఒక ట్రెండ్ గమనించాను. ఫలానా పుస్తకం బాగుందండీ అంటే దాని పిడిఎఫ్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు.తెలుగు భాష ని ఉద్ధరించుకోవడం అంటే మంచి తెలుగు పుస్తకాల్ని కొని చదవడం కూడా అని ఎందుకనుకోరో అర్ధం కాదు.మళయాళం లో గాని,కన్నడ భాష లో గాని మంచి పుస్తకం అని పేరు వస్తే మొదటి ఏడాది లో కనీసం మూడువేల ప్రతులు అమ్ముడవుతాయి.అంటే వారికి పిడిఎఫ్ ల గూర్చి తెలియదా ...భాషాభిమానాన్ని మాటల్లో తో బాటు చేతల్లో చూపించాలి. అది నేటి అవసరం. 

----- మూర్తి కెవివిఎస్ (7893541003)    

Thursday 27 May 2021

ముస్సోరి గ్రాండ్ మేన్ ..!

 

రస్కిన్ బాండ్..! ఈ పేరు వినగానే చిన్న పిల్లలు ,పెద్ద వాళ్ళు అనే భేదం లేకుండా చదవడం హాబీ గా ఉన్న వారి హృదయాలు ఆహ్లాదం తో పరవశిస్తాయి.ఈయనని ముస్సోరి గ్రాండ్ మేన్ అని పిలుస్తారు.ఎందుకంటే ఈ రచయిత హిమాలయ సానువుల్లోని లాండోర్ అనే ప్రాంతం లో నివసిస్తూంటారు.ఇది ముస్సోరి లో ఓ భాగమే.ప్రతి శుక్రవారం అక్కడ ఉన్న ఓ బుక్ షాప్ లో తన అభిమానుల్ని కలుసుకుంటూంటారు.


87 ఏళ్ళ రస్కిన్ బాండ్ దాదాపుగా 80 కి పైగా పుస్తకాలు రాశారు.కొన్ని వందల కథలు రాశారు.ఆయన రచనల నేపథ్యం అంతా  ముస్సోరి దాపుల్లోని గుట్టలు,అడవులు,ప్రకృతి శోభ మీద ఆధారపడిఉంటాయి.అంతే గాక తన అనుభవాల్లోకి వచ్చిన ఇతర విషయాలని కూడా ఆధారభూతంగా తీసుకుంటారు. ఆయన రచనలు ఎన్నో పాఠ్య గ్రంథాల్లో ప్రచురింపబడ్డాయి.


దూర దర్శన్ టి.వి.సీరియల్స్ గా  వచ్చాయి.కొన్ని సినిమాలు గానూ రూపొందాయి.ఆయన తల్లిదండ్రులు బ్రిటీష్ జాతీయులు. తండ్రి నాటి బ్రిటీష్ రాజ్ లో చిరు ఉద్యోగి.ఆ తర్వాత రాయల్ నేవీ చేరారు.రస్కిన్ బాండ్ సింలా లోని బిషప్ కాటన్ విద్యాలయం లో చదివారు.కొంత కాలం లండన్ వెళ్ళి చిన్నా చితకా పనులు చేశారు.ఆ తర్వాత భారత్ కి వచ్చి రచనల్నే వృత్తిగా చేసుకొని చేసుకొని జీవించడం మొదలెట్టారు. 


పద్మశ్రీ,పద్మభూషణ్ పురస్కారాల్ని పొందారు.ఎంతో సరళమైన ఆంగ్లం లో అందరకీ అర్ధమయ్యే రీతి లో ఉండే ఆయన పుస్తకాలు అమెజాన్ లోనూ ఇంకా ఇతర ప్లాట్ ఫాం ల్లోనూ అందుబాటు లో ఉన్నాయి.ఈ లాక్ డవున్ సమయం లో చిన్నలూ,పెద్దలూ చదవడానికి ప్రయత్నించడి.   

Monday 11 February 2019

"దంతెవాడ" (కధలు) గురించి యండమూరి అన్న మాటలు నూటికి నూరు పాళ్ళు నిజం..!


విన్నూత్నమైన వస్తువు,దాన్ని చెప్పే పద్ధతి ఈ రెండు విషయాల్లోనూ "దంతెవాడ" కదాసంపుటి ఒక ప్రత్యేకత ని సంతరించుకున్నది.చత్తిస్ ఘడ్ లోని ఆ ఊరి పేరు అందరకీ సుపరిచితమే కాని అక్కడి పరిసరాల్లోని సంఘటనల్ని దీనిలో ఓ కధ లో చిత్రించిన తీరు హృదయాన్ని కదిలించితీరుతుంది.బ్రిటీష్ వారి అవశేషాలు ఉన్న ఒక ఊరి లో గల విశేషాలు స్మృతి కధ లో చక్కగా వర్ణించారు.ఒక కోతి ఏ విధంగా  పాఠశాల వాతావరణాన్ని మార్చినదీ మరో కధ లో  తెలుసుకుంటే అబ్బురపడక మానము.రోడ్డు మీద జంతుప్రాయులు గా సంచరించే ముసలామె కధ వళ్ళు జలదరింప చేస్తుంది.మొత్తం పదకొండు కధలు ఉన్న ఈ సంపుటి చదువరి ని ఎంతమాత్రం నిరాశ పరచదు.ఈ పుస్తకం గురించి కవర్ పేజీ  వెనుక మాట గా  ప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ చెప్పినట్లు నవ్యత ని ఆస్వాదించే ప్రతి ఒక్కరు దీన్ని చదవాలి.

(Rs.80/-   :ప్రతులకు: నవోదయ బుక్ హౌస్,ఆర్య సమాజ్ ముందు వీధి ,కాచి గూడ ,హైదరా బాద్-500027. మొబైల్: 9000413413)

Kinige edition here http://kinige.com/kbook.php?id=9297

Tuesday 7 August 2018

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కధలు (పుస్తక పరిచయం)


పెద్దిభొట్ల సుబ్బరామయ్య పేరెన్నిక గన్న తెలుగు కధకులు.నిత్య జీవిత సత్యాలను ఎంతో హృద్యంగా చిత్రించి తనదైన శైలి లో తెలుగు పాఠకులకు అందించారు.ఆయన కధలను ఏరి అరసం సాహిత్య సంస్థ ప్రచురించిన పుస్తకం ఈ పెద్దిభొట్ల సుబ్బరామయ్య కధలు.దీనిలో 12 కధలు ఉన్నాయి.కళ్ళజోడు,అలజడి,దగ్ధ గీతం,సతీ సావిత్రి,కొళందవేలు బొమ్మ,చుక్కమ్మ కధ,ఇంగువ ఇంకా తదితర కధలు.మాన జీవితం లోని విషాద సన్నివేశాలను ఇంకా సమస్యలను అతి సామాన్య శైలి లో మనోరంజకంగా వెలయించారు.సాహిత్య అకాడెమీ గ్రహీత అయిన సుబ్బరామయ్య కధలను ప్రతి అభిరుచి కలిగిన పాఠకుడూ చదవాలి.

పేజీలు:112 ,వెల: రూ.50/-

ప్రతులకు: అభ్యుదయ రచయితల సంఘం,గుంటూరు జిల్లా శాఖ.
101,బృందావన్ పార్క్ రెసిడెన్సి,7వ లేన్,ఎస్.వి.ఎన్.కాలని,గుంటూరు-522006,సెల్:92915 30714  

Sunday 18 December 2016

చాలానాళ్ళకి ఒక ఆలోచనలు రేపే పుస్తకం



ఇంగ్లీష్ అవసరం తెలుగు సమాజం లో ఉందా లేదా..ఉన్నట్లయితే ఎంత దాకా ఉంది..? ప్రతి గ్రామం లో ఈ రోజున ఇంగ్లీష్ పాఠశాల వెలుస్తున్నది గాని సరైన ఇంగ్లీష్ పరిజ్ఞానం ఎందుకని నెలకొల్ప లేకపోతున్నది..: ఎక్కడ లోపం ఉంది..? దీనికి తరుణోపాయం ఎక్కడ  ఉన్నది..?ఇప్పటికే ఉన్న అభ్యసన విధానం  లో ఏ మార్పులు అవసరం..?మొత్తం మీద కలిపి ఇరవై ఏళ్ళు విద్యాలయాల్లో గడిపిన సరైన జ్ఞానం..అంటే కనీసం ఓ వ్యాసం రాసే పరిజ్ఞానం లేకుండా ఎందుకు పోతున్నది..? ఇలాంటి విషయాలన్ని ఎలాంటి శష భిషలు లేకుండా  చర్చిన మొట్ట మొదటి పుస్తకం..! అంతే కాదు వివిధ  ఆంగ్ల రచయితల శైలి ని వివరిస్తూ వారి నవలల్ని విశదీకరించిన పుస్తకం ఇది.బహుశా ఇది తెలుగు రచనా రంగం లో ఒక విన్నూత్న తరహా కి చెందిన పుస్తకం అని చెప్పవచ్చు.ప్రతి తెలుగు పాఠకుడు చదవవలసిన పుస్తకం ఈ" మూర్తీస్ మ్యూజింగ్స్"  .

For Copies: Navachetana Book house and Navodaya book house,Hyderabad., Visalandhra book house ,Vijayawada.

Sunday 22 May 2016

సత్యజిత్ రాయ్ స్కెచ్ బుక్ అమ్మకానికి...



భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సత్యజిత్ రాయ్  ది ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పాలి.ఆయన 95 వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని హార్పర్ కోలిన్స్ వాళ్ళు ఒక ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు.అదేమిటంటే 1955 లో ఆయన మొదట దర్శకత్వం వహించిన పధేర్ పాంచాలి సినిమా కోసం ఆ సినిమా తీసే సమయం లో వేసుకున్న స్కెచ్ ల్ని పుస్తంగా  ముద్రించారు.స్క్రీన్ ప్లే కి బదులుగా రాయ్ ఈ విధంగా రాసుకున్నారు.ఈ బొమ్మలు,రాతలు ఉన్న ఈ పుస్తకాన్ని ఒక ఆర్కైవ్ కి డొనేట్ చేశారు.మళ్ళీ ఇన్నేళ్ళకి పాఠకుల కోసం అది అమ్మకానికి వచ్చింది.108 పేజీలు ఉన్న పుస్తకం ఆరువందల రూపాయల పై మాటే.అన్నట్టు పధేర్ పాంచాలి నవలని బిభుభూషణ్ బందోపాధ్యాయ బెంగాలీ లో రాసిన విషయం తెలిసిన విషయమే..!

Saturday 2 April 2016

ఇండో ఆంగ్లికన్ రచయిత్రిగా రాణిస్తున్న ఇంజనీరింగ్ అమ్మాయి



ప్రాచి ప్రజ్ఞ్య అగస్తి,ఈ 21 ఏళ్ళ అమ్మాయి  ఒరిస్సా రాజధాని  భువనేశ్వర్ లో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతోంది.గత ఏడాది Just once అనే రొమాంటిక్ థ్రిల్లర్ నవల రాసి విడుదల చేసింది.మంచి ఆదరణ రావడం తో ఈ ఏడాది మరో నవల White night moonbeams ని రాసి విడుదల చేసింది.తన తొమ్మిదవ తరగతి నుంచే కధలు,కవితలు రాసేదాన్నని అంటున్నది. అన్ని రకాల ఇతివృత్తాల్ని స్పృశించాలనేది ఆమె ఆశయం గా చెబుతున్నది.త్వరలోనే కొన్ని కధల్ని సంకలం గా వేయబోతున్నట్లు తెలిపింది.Judith McNaught,Julie Garwoo,Mario Puzo  లంటి వారి రచనలు ఇష్టమట.

Tuesday 13 October 2015

కూర గాయల కధా కమామీషు తెలిపే పుస్తకం..!



కూరగాధలు అనే ఈ పుస్తకం లోని వ్యాసాలు ఒకప్పుడు ఆంధ్రజ్యోతి డైలీ లో ధారావాహికగా వచ్చినట్టివే.మనం ఎన్నో కూరగాయల్ని నిత్య జీవితం లో తింటూ ఉంటాము.తరచుగా వాటి  పుట్టు పూర్వోత్తరాల్ని ఇంకా ఆహార ఔషధ విలువల్ని తెలుసుకోవాలని అనిపించడమూ సహజం.బంగాళా దుంపలు,వంకాయ,టొమాటో ,పొట్లకాయ,సొరకాయ,పనస,చింత మునగ ,బొప్పాయి ఇలా అనేక రకాలైన కూరగాయలు వివిధ దేశాలు ఎలా ప్రయాణం చేశాయి అనేది విపులంగా వివరించారు ముత్తేవి రవీంద్రనాధ్.అలాగే పుస్తకం చివర అనుబంధం లో అమృతాహారం గురించి తెలిపారు. పేజీలు: 270   వెల: 250   ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచ్ లు మరియు రచయిత సెల్ నెం: 98491 31029 Click here

Tuesday 29 September 2015

చేతన్ భగత్ నుంచి వచ్చిన మరో నవల ఈ 3 Mistakes of my life



చేతన్ భగత్ నుంచి వచ్చిన మరో నవల ఈ 3 Mistakes of my life. సమకాలీన అంశాలతో యువతని ఆకర్షిస్తున్న రచయిత దీనిలో కూడా ఈ సారి ముగ్గురు యువకుల కధని తీసుకున్నాడు.అయితే రచయిత కూడా కధ లో భాగంగా కలిసిపోయి ఆనంద్ అనే యువకుని వద్దకి వెళ్ళినప్పుడు ఈ గాధని ఆ యువకుడు చెప్పడం ప్రారంభిస్తాడు.చాల సులభమైన ఇంగ్లీష్ భాష లో హాయిగా సాగిపోతుంది.ప్రతులకు: Rupa Publications India Pvt.Ltd,7/16,Ansari Road,Daryaganj,New Delhi 110002. Pages:257  Rs.176/-