వస్త్రాలు లాండ్రికి వేసినట్టే మనం వేసుకునే షూస్ ని కూడా లాండ్రి వేయవచ్చు.మళ్ళీ నిగ నిగ లాడేలా చేసుకోవచ్చు.దానికి పట్టిన దుమ్ముని,వాసనని శుభ్రం చేసి చక్కగా మళ్ళీ ధరించవచ్చు.సందీప్ గజకాస్ అనే వ్యక్తి ముంబాయి లో ఇలాంటి షాప్ ని ఈ మధ్య తెరవగా దాని స్ఫూర్తి తోనే ఇప్పుడు ఒడిస్సా లోని భుబనేశ్వర్ లో శాంతి భూషణ్ నాయక్ (35) అనే ఎంసిఏ చదివిన యువకుడు రివైవ్ షూ షాప్ ని ప్రారంభించాడు.నిజానికి ముంబాయి లోని సందీప్ నుంచి ఫ్రాంచిజ్ పొందాలనుకున్నాడు.కాని అతను చెప్పిన రేట్లు తనకి గిట్టుబాటు కావని తోచి తానే రెండు లక్షల పెట్టుబడితో షాప్ తెరిచాడు ఇంకో మిత్రునితో కలిసి..!
ఇంటర్నెట్ ద్వారా కొన్ని టెక్నిక్ లి నేర్చుకున్నాడు.అలాగే ఢిల్లీ వెళ్ళి ఓ వారం రోజులుపాటు శిక్షణ పొందాడు.చెప్పు లేదా షూ కి పట్టిన దుమ్ము ధూళిని,వాసన ని తొలగించడానికి తన వైన చిట్కాల్ని కూడా ఉపయోగిస్తాడు.ప్రస్తుతం కార్పోరేట్ లు కూడా 200 నుంచి 300 జతల్ని ఇస్తుంటారు.మొదటిలో కొంతమంది తెలిసిన వారు మాత్రమే ఇచ్చేవారు.పోను పోను గిరాకి పెరగసాగింది.ఇంకో ముగ్గురు కుర్రాళ్ళని పెట్టుకున్నాడు.అన్ని ఖర్చులు పోను నలభై వేల దాకా వస్తున్నాయి.బిజినెస్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నాడు నాయక్.
No comments:
Post a Comment