ప్రపంచం లోనే అత్యంత పెద్దదైన హిందూ దేవాలయం ఎక్కడ ఉంది అంటే కాంబోడియా లోని అంగోర్ వాట్ లో ఉంది అని చెబుతారు. అయితే అదే దేశం లో ఉన్న ఇంకొక అద్భుతమైన ఆలయం గురించి చాలా తక్కువమంది కి తెలుసు. దానిపేరు బేయన్ టెంపుల్. ఏడవ జయవర్మ 12 లేదా 13 వశతాబ్దం ప్రారంభ కాలం లో దీనిని నిర్మించారు.ఈ ఆలయం లో ఉన్న అన్ని గోపురాల మీద నాలుగు ముఖాల తో ఉన్న ఒక మనిషి మర్మగర్భం గా నవ్వుతున్నట్లుగా ఉంటుంది. ఆ ముఖాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి.మొత్తం మీద ఈ ఆలయం 216 ముఖాలు అలాంటివి ఉన్నాయి.
ఉన్నట్లుండి ఏమరుపాటు గా చూస్తే ఒక్కక్షణం భయం,ఆశ్చర్యం ఒకేసారి కలుగుతాయి.ఈ దేవాలయానికి వచ్చే గుమ్మం మొదట్లో దేవతలు,రాక్షసులు చెరోవేపున ఉన్నట్లు పాలసముద్రాన్ని చిలికే ఘట్టాన్ని శిల్పాల్లో చెక్కారు అప్పటి శిల్పులు.ప్రవీణ్ గారు చేసిన ఈ వీడియో లో చూడండి,చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ మార్మిక వదనం మొదట్లో బోధిసత్వుని ది అనుకున్నారు. కాని బుద్ధుని కి సంబందించిన ఏ శిల్పాల్లోనూ నాలుగు ముఖాలతో ఉన్నట్లు గాని,మూడు నేత్రాల తో ఉన్నట్లుగాని ఏ బౌద్ధ గ్రంథాల్లోనూ లేదు.అది బ్రహ్మ యొక్క ముఖమని ఆ విధం గా నిర్మించడం లో అంతరార్ధాన్ని ఈ వీడియో లో చెప్పారు.
ఆసియా ఖండం లో తూర్పు వేపున మనకి చేరువ లోనే ఉన్న ఈ కాంబోడియా దేశానికి ఎంతమంది వెళ్ళిఉంటారు..? భారతీయ మూలాలు ఎంతో స్పష్టం గా ఉన్న పక్కదేశాలకి వెళ్ళి అక్కడి విషయాల్ని కూడా మనం పరిశీలించాలి.లేకపోతే ఎలాంటి అవగాహన లేని వారి మాటల్నే నిజమైన చరిత్ర గా లోకం తీసుకుంటుంది.1945 నుంచి జపాన్ దేశం ఈ బేయన్ టెంపుల్ ని సమ్‌రక్షించడానికి తీసుకుంది.ఖ్మేర్ రాజుల కాలం లో కొన్ని బౌద్ధ శిల్పాలు దీనిలో చొప్పించినప్పటికి మౌలికంగా హైందవ ఆలయమని తెలిసిపోతూనే ఉంటుంది.
------ News Post Desk
No comments:
Post a Comment