శ్రీదేవి ఎస్.కర్త అనే మళయాళ రచయిత్రి APJ అబ్దుల్ కలాం రచించిన ఓ పుస్తకాన్ని మళయాళం లోకి అనువదించారు.దాని రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు థ్రిస్సుర్ లో బ్రహ్మ విహారి దాస్ అనే స్వామిజీ చేతుల మీదుగా జరిగింది.ఆయన ఉన్న వేదిక వద్దకి వెళ్ళడానికి గాని పక్కన కూర్చోడానికి గాని అనువాదకురాలికి అవకాశం ఇవ్వలేదు ,కారణమేమంటే ఆ స్వామిజి కి స్త్రీ నీడ కూడా తాకడానికి ఇష్టం ఉండదట.అది వారి ఆచారమట.దానితో ఆ రచయిత్రి ఆ ఫంక్షన్ ని బాయ్ కాట్ చేసి వచ్చేసింది.ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో పేర్కోవడం జరిగింది.Click here
బుక్ రిలీజ్ ఫంక్షన్ బహుశ: పబ్లిషర్స్ ఏర్పాటు చేసినదయ్యుండాలి. రచయిత్రికి చెప్పకుండా వాళ్ళు స్వామీజీ షరతులు ఒప్పుకున్నారేమో? ఏమయినా బాయ్ కాట్ చేసి శ్రీదేవి (పుస్తక రచయిత్రి) తగు రీతిన సమాధానం చెప్పింది. అభినందనీయురాలు.
ReplyDelete