హన్స్ దా సౌవేంద్ర శేఖర్ (34) జార్ఖండ్ లోని పకూర్ జిల్లా లో బేల్ దంగా అనే బ్లాక్ లో ప్రభుత్వ వైద్యుని గా పనిచేస్తున్నారు.దానితో పాటు ఈయన రచయిత కూడా.ద ఆదివాసి విల్ నాట్ డాన్స్ అనే కధల సంపుటిని రెండేళ్ళ క్రితం వెలువరించాడు.ఈ ఆంగ్ల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం కూడా దక్కింది అంతేకాదు హిందూ పేపర్ దీనికి ఉత్తమ ఫిక్షన్ కి ఇచ్చే పురస్కారం ఇచ్చింది.అయితే ఈ పుస్తకం ఇటీవల హిందీ భాష లో అనువాదం కావడం తో చదివిన జార్ఖండ్ వాసులు చాలామంది ఆగ్రహం తో ఊగిపోతున్నారు. సంతాలీ ఆదివాసి స్త్రీలని అవమానించే విధంగా వర్ణనలు ఉన్నాయని ఇంకా స్థానిక నాయకులైన వారిని చిన్నబుచ్చే కొన్ని కధలున్నాయని అంటున్నారు.జార్ఖండ్ రాష్ట్ర విముక్తి కై పోరాడిన నిర్మల్ మహతో పేరు ని ఒక దుష్ట పాత్రకి పెట్టారని ,ఆదివాసి దేవుళ్ళని,సంస్కృతిని కించపరిచే విధంగా ఈ పుస్తకం ఉందని కనుక సెప్టెంబర్ 4 లోపు ఈ పుస్తకానికి సంబందించిన అన్ని కాపీల్ని తగలబెట్టాలని వివిధ సంఘాలు పిలుపునిచ్చాయి.
అయితే హన్స్ దా ని సమర్దిస్తూ కొంతమంది మేధావులు సంతకాల సేకరణ చేస్తున్నారు. ఫేస్ బుక్ , ట్విట్టర్ ల లో దుమ్మెత్తి పోసుకుంటూ మొత్తానికి ఈ రచయిత కి పెద్ద పబ్లిసిటీ నే చేస్తున్నారు.ఈ రోజు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు భోగట్టా.అయితే ఈ రచయిత కూడా సంతాలీ తెగ కి చెందిన వారే.అదీ కొసమెరుపు.
No comments:
Post a Comment