సుదర్శన్ పట్నాయక్ ...ఈ ఒక్క పేరు చాలు.సైకత కళ కి మన దేశం లో పర్యాయపదం ఆయన పేరు.జాతీయ,అంతర్జాతీయ ప్రాముఖ్యత గల రోజులను భావ యుక్తం గా ఇసుక లో శిల్పాలు గా మార్చి మనల్ని అలరించే వ్యక్తి ఆయన.అసలు ఆ రంగం ని ఎందుకు ఎలా ఎంచుకున్నారో సుదర్శన్ ఒక పత్రిక కి ఇటీవలనే చెప్పారు.ఆయన చిన్నతనం లో తండ్రి ని కోల్పోయారు ,బామ్మ పెన్షన్ తో చిన్నప్పుడు కుటుంబం అంతా గడిచేది.అది సరిపోక పక్క ఇంట్లో పనిమనిషి గా పనిచేశాడు.ఖాళీ గా ఉన్నప్పుడు తను పుట్టిన ఆ పూరి పట్టణం లోని బీచ్ కి వెళ్ళి ఇసుక తో రకరకాల గూళ్ళు నిర్మించేవాడు.ఇది కేవలం ఆర్ట్ మీద ఉన్న తనకున్న ఇష్టం తోనే చేశేవాడు.తప్ప ఎలాంటి ప్రతిఫలం కోసం కాదు.
ఒకసారి తను నిర్మించిన ఇసుక శిల్పాల్న్ని చూసిన విదేశీయులు అతడిని అభినందించారు.దానితో ఆసక్తి పెరిగి దానిని కొనసాగించాడు.రమారమి అయిదు ఏళ్ళు అలాగే పైసా ఆదాయం లేకుండా రోజు అలాంటివి బీచ్ లో నిర్మించేవాడు.ఇట్లా ఇసుక లో వేసేవి కొట్టుకుపోయేవి యే గదా..దీనివల్ల ఏం ప్రయోజనం అని కొంతమంది విమర్శించేవాళ్ళు.కాని ఎందుకనో అది తప్పనిపించేది..మనిషి జీవితం కూడా ఏదో ఒకరోజు పోయేదే అలా అని జీవించడం మానేస్తున్నామా.. అనిపించేది.కొన్నాళ్ళకి చూసే వాళ్ళు పెరిగారు.తన శైలిని ఇంకా మార్చుకొని రకరకాల ప్రయోగాలు ఆ ఇసుక లోనే చేశాడు.
బెర్లిన్ లో జరిగిన అంతర్జాతీయ సైకత పోటీ లో గోల్ మెడల్ వచ్చిన తర్వాత దేశ విదేశాల్లో అతని పేరు మారుమోగింది.ఆ తర్వాత ఒకటా రెండా ఎన్నో పోటీల్లో ఫాల్గొని సైకత కళ కి మన దేశం లో పర్యాయపదం గా మారాడు.పెద్ద గా చదువుకోని ఒక నాటి బాల కార్మికుడు ఈ కళ ద్వారా నే పద్మశ్రీ ఇంకా డాక్టరేట్లు పొందాడు.పట్టు విడువకుండా తన హృదయం చెప్పే పనిని చేసేవారికి గొప్పదనం వెదుక్కుంటూ వస్తుందనడానికి పట్నాయక్ జీవితమే ఓ ఉదాహరణ.ఒడియా ప్రజలు తమ కళా ప్రతినిది గా ఈయనని ఎంతో అభిమానిస్తారు.
We have started our new telugu youtube channel : Garam chai .
ReplyDeletePlease watch and subscribe our channel and encourage us too
https://www.youtube.com/garamchai