సోనం వాంగ్ చుక్ (Sonam Wangchuk) అంటే ఎవరు..అని ప్రశ్నించవచ్చు.కాని రాజ్ కుమార్ హిరాని త్రీ ఇడియట్స్ సినిమా లో ఫున్సుక్ వాంగ్ డు పాత్ర పెట్టడానికి కారణం ఈయనే అని తెలిస్తే పని ఈజీ అవుతుంది. అందరికి మల్లేనే ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళాడు.ఆ తర్వాత తన రూటు తెలుసుకొని తమ ప్రాంతం లడక్ వచ్చేశాడు.ప్రపంచం లోని ఎత్తైన ప్రదేశాల్లో అది ఒకటి.విపరీతమైన చలి.సరైన సదుపాయాలు రవాణా పరంగా లేకపొయినా టూరిస్ట్ లు మొండి కోరిక వల్ల రాగలుగుతున్నారు.ఇంకా అక్కడి సమస్యలు ..ఎన్నో అవి తమ లాంటి వారే తీర్చుకోవాలి.తమ ప్రాంతం గూర్చి తమ కంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు.ఏప్రిల్,మే నెలల్లో అక్కడ హిమం అంతా నీళ్ళ సమస్య ఏర్పడుతుంది.దానికి గాను వాంగ్ చుక్ హీమ స్తూపాలు నిర్మించడం మొదలు పెట్టాడు.అలా నీటిని వాడుకోవడాన్ని తెలివి గా కొనసాగిస్తున్నారు.అలానే సోలార్ సిస్టం ద్వారా మొత్తం లడక్ ని వెలిగిస్తున్నారు.పర్వత ప్రాంతాల్లోని ప్రత్యేక సమస్యల్ని అధ్యయనం చేసి వాటికి సొల్యూషన్లు కనిపెట్టడానికి ఒక యూనివర్శిటి ని పెట్టాడు.దాని పేరు హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అల్టర్నేటివ్స్ ,ఫ్యూచర్ యూనివర్సిటి అని ముద్దు పేరు.ప్రపంచ వ్యాప్తం గా ఎంతో గుర్తింపు వచ్చింది.మన సిలబస్ లు మన ప్రాంత సమస్యల మీద పరిష్కారాలు చూపే విధంగా ఉండాలి తప్ప ఇంకో దేశం నుంచి అరువు తెచ్చుకోకూడదు.అవి ఎంత గొప్పవైనా ..అంటున్నాడు ఈ మేధావి.
మీ నుంచి ఇన్స్పిరేషన్ పొంది సినిమా తీశారు గదా అని అడిగితే మన భారతీయులకి ఈ సినిమా పిచ్చి అవసరం అయినదాని కంటే చాలా ఎక్కువ.దానిని పెద్ద గా పట్టించుకోను అంటాడు వాంగ్ చుక్.విరాళాలు ఓ మంచి పనికి ఇచ్చే సంస్కృతి మన వద్ద రావలసినంత రాలేదు.మూఢ నమ్మకాల పేరు మీద అందినంత ఇస్తుంటారు తప్ప విజ్ఞాన జ్యుతులు వెలిగించడానికి మాత్రం చేతులు రావు అంటాడు.
No comments:
Post a Comment