గత మంగళ వారం సోషలైట్ , రచయిత్రి శోభా డే ఒక ట్వీట్ చేసింది.ముంబాయి స్థానిక ఎన్నికలు జరిగినపుడు ఆ భద్రతా పరమైన విధుల్లో లావు గా కనిపించిన ఒక పోలీస్ అధికారి ఫోటొ ని ట్వీట్ చేస్తూ భారీ బందోబస్త్ జరిగింది అంటూ వ్యాఖ్యానించింది. అయితే ఇది ముంబాయి పోలీస్ లది అని ఆమె అనుకుంది...అయితే ముంబాయి పోలీస్ దానికి స్పందించి ఈ ఫోటో తమ ముంబాయి పోలీస్ వర్గాలది కాదని పద్దతి గా వ్యాఖ్యానించడం నేర్చుకొమ్మని సలహానిచ్చింది.అయితే ఈ ఫోటో మధ్య ప్రదేశ్ కి చెందిన దౌలత్రాం జోగేవత్ అనే పోలీస్ ఉద్యోగిది ..దీన్ని చూసిన ఆయన తీవ్రంగా స్పందించాడు,బందో బస్త్ కి ముంబాయి వెళ్ళినప్పుడు ఇది తీశారని,అయితే తాను బాగా తిని లావు ఎక్కలేదని తనకి 1993 లో గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగిన పిమ్మట అనారోగ్యం వల్ల అలా అయినానని తన మీద అనుచిత వ్యాఖ్యాలు చేసిన శోభా డే మీద ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయం లో తన పై అధికారు తో సంప్రదిస్తున్నానని చెప్పాడాయన.
Thursday, 23 February 2017
వికటించిన శోభా డే ట్వీట్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment