Monday 23 June 2014

పెద్ద చేప కి వచ్చిన పెద్ద తిప్పలు (విశేష వార్త)



13 నెలల కాలం లో అంటే ఫిబ్రవరి 2013 నుండి ఇంచుమించు ఇప్పటిదాకా 15 పెద్ద చేపలు (Whale Sharks) తూర్పు తీరం లోని గోదావరి ప్రాంతం లో చంపబడినాయి.ఈ సంఖ్య ఒక రకంగా ఆందోళన కలిగించేదే.ఎందుకంటే గత వంద సంవత్సరాల్లో అంటే 1890 నుంచి లెక్కవేసుకుంటే చంపబడినవి మొత్తం 20 మాత్రమే.ఈ Whale sharks ని అతి పెద్ద చేపలుగా పరిగణిస్తారు.(Largest living non-mammalian vertebrate) గా చెబుతారు.రమారమి 40 అడుగుల పొడుగు,21.5 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుందిది.

పులిని సం రక్షించడానికి ఎంత ప్రాముఖ్యత నిస్తారో ఈ పెద్ద చేప జాతిని రక్షించడానికి ప్రభుత్వం అంత ప్రాముఖ్యతనిస్తున్నది.భార వన్మృగ సమ్రక్షణ చట్టం (protection) Act-1972 ప్రకారం ఈ ప్రాణిని చంపిన వారికి 7 ఏళ్ళదాకా జైలుశిక్షని,జరిమానా తో కలిపి విధించవచ్చు.

ప్రపంచం లో చాలా చోట్ల ఈ పెద్ద చేపని టార్గెట్ చేసి చంపుతున్నారు.1990 దశకం లో గుజరాత్ తీరం లో ఈ చేపల్ని బాగా టార్గెట్ చేసి చంపివేశారు.గోదావరి ప్రాంతం లో మాత్రం ప్రత్యేకంగా టార్గెట్ చేయడం లేదుగాని మత్స్యకారుల వలలో పడితే మాత్రం బయటికి లాగి చంపి కోసివేయడం జరుగుతుంది.

ఈ చేప గనక వల లో పడితే 30 వేల నుండి 50 వేల రూపాయలు ఖరీదు చేసే విలువైన వారి వలలు ఎందుకూ పనికి రాకుండా పోతాయి.మళ్ళీ దీన్ని బయటికి తీసిన తరువాత కోయడానికి 3 వేల నుంచి 5 వేల దాకా ఖర్చు అవుతాయి.కనుక అయినంతవరకు జాలరులు అమ్మివేస్తారు.22  అడుగుల ఈ పెద్ద చేపని 15 వేలు కి భైరవపాలెం లో అమ్మినట్లు వార్తలు చెప్తున్నాయి.ఈ మర్చి నెలలో 15 అడుగులున్న ఇంకో చేపని 10 వేలకి అమ్మినట్లు భోగట్టా.

ఈ పెద్ద చేపని సమ్రక్షించడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి చేపల వేటగాళ్ళకి పెద్దగా తెలియదు.గుజరాత్ లో ఈ చేపని సముద్రం లో దొరికినపుడు మళ్ళీ దాంట్లో వదిలివేస్తే గనక 25 వేల రూపాయల రివార్డ్ ని ఇస్తారు.మన రాష్ట్రం లో అలాంటి స్కీం EGREE Foundation ద్వారా పైలట్ ప్రాజెక్ట్ గా తూ.గో.జిల్లా లో అమలుపరుస్తున్నట్లు సమాచారం.Click here

 -----News Post Special Desk 

No comments:

Post a Comment