Monday 29 September 2014

ముంపు మండలాల ఉద్యోగుల గోడు పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం



వచ్చే నెల మొదటి తేదీ నుంచి పోలవరం ముంపు మండలాలు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిందికి రానున్నాయి.సకల విషయాలను ఇక ఆంధ్ర ప్రభుత్వమే పట్టించుకోవలసి ఉంటుంది.ఇప్పటికే అధికారులు సర్వం సన్నద్ధం చేసుకొని తయారుగా ఉన్నారు.అటు తెలంగాణా ప్రభుత్వం కూడా బెట్టు చేసినా అంగీకరించని తప్పనిసరి పరిస్థితి. చింతూరు,వరరామచంద్ర పురం,కూనవరం,భద్రాచలం (పాక్షికం) ,కుక్కునూరు,వేలేరుపాడు వంటి మండలాలు తెలంగాణా నుంచి ఆంధ్రా ప్రాంతం లో కలవనున్నాయి.ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు తమని తెలంగాణా కి మళ్ళించవలసిందిగా కోరుతున్నారు.ఈ మేరకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు,రాజ్ నాధ్ సింగ్ లు సైతం ఆమోదం తెలిపారు.ఉద్యోగనేతలు వారిని కలిసినపుడు ఈ మేరకు వారికి హామీ ఇచ్చారు.విచిత్రంగా ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం వీరి విషయం లో ఏమీ పట్టనట్లు వ్యవహరించడం దారుణమని భావిస్తున్నారు.దాదాపుగా అయిదు వేల ఉద్యొగులు అన్ని శాఖల్లో కలిపి పనిచేస్తుండగా ,చాలా తక్కువమంది ఆంధ్రా వేపు వెళ్ళడానికి మొగ్గుచూపుతున్నారు.అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్తగా ఉద్యోగుల్ని నింపడానికి తయారుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.నిజానికి కమలనాధన్ కమిటీ తో పనిలేకుండానే ఈ పని చేయవచ్చు.కాని ఎందుచేతనో నిమ్మకు నీరెత్తి నట్లు తెలంగాణా ప్రభుత్వం మిన్నకున్నది.దీనివెనుక మర్మమేమిటో ఆ దేవుడికే తెలియాలి.ఇంచుమించు అన్ని తెలంగాణా జిల్లాలకి చెందిన వారు ఈ ప్రాంతం లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. 

No comments:

Post a Comment