Wednesday 20 May 2015

కేరళ బీచ్ ని శుబ్రపరుస్తున్న రష్యన్ లు....



కేరళ లో దక్షిణ ప్రాంతం లో ఉండే ఊరు వర్కాల.మంచి అందమైన బీచ్ తో,ప్రకృతి సౌందర్యం తో అలరారే సముద్ర తీరం లో చెత్తంతా పోగుపడుతుంటే చూడ లేక క్లీన్ చేసే పనికి చొరవ చూపారు ముగ్గురు రష్యన్ లు.నికితా బాటిస్చేవ్ ఇంకా ఇద్దరు సహచరులతో ఈ పనికి పూనుకోగా స్థానికులు కూడా వారికి ఇప్పుడు సహకరిస్తున్నారు.గన్ని బాగ్స్ తీసుకుని చెత్తనంతా పోగు చేసి మున్సిపాలిటీ వారు వచ్చే గుట్ట దగ్గర కి ఇచ్చేసి వస్తుంటారు.క్లీన్ వర్కాల ప్రాజెక్ట్ కింద ఈ పనిని ముందుకు తీసుకు పోతున్నారు. రోడ్డు మీద కాని ఇంకెక్కడ కాని ఒక చిత్తు కాగితం వేసే ముందర అసలు దాన్ని ఎవరు తీస్తారు అని ప్రతి ఒక్కరు ఆలోచించిన రోజున చాలా మార్పు వస్తుందని వీరు అంటున్నారు.Click here

No comments:

Post a Comment