ప్రసిద్ద హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ముంబాయి పోలీసులకి తనకి ఒక నెల రోజులనుంచి చంపివేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు.సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినపుడు ఆయనకి 24/7 సెక్యూరిటి ఇవ్వడం జరిగింది.మళ్ళీ తనకు రక్షణ ఏర్పాటు చేయాలని ఆయన కోరిన మీదట ఈ కేసుని యాంటి ఎక్స్ టోర్షన్ వింగ్ కి అప్పజెప్పారు.బాగా పేరు మోసిన ఒక గ్యాంగ్ స్టర్ నుంచి ఈ కాల్స్ వస్తున్నట్టు గమనించామని అంతకు మించి చెప్పలేమని పోలీసులు తెలిపారు.Click here
No comments:
Post a Comment