మేఘాలయా రాష్ట్రాన్ని చూడవలసి వస్తే షిల్లాంగ్ తో పాటు ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి.ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా ఇతర రాష్ట్రాల లో లాగా పర్యావరణ విధ్వంసం ప్రారంభం కాలేదు.ఉమంగట్ నది ఇప్పుడు టూరిస్ట్ ల్ని బాగా ఆకర్షిస్తోంది.ఈ నది లోని నీళ్ళు తేటా తెల్లం గా అడుగు భాగం చక్కగా కనబడేలా ఉంటుంది.చలి కాలం లో మరీ బాగుంటుంది.మన దేశీయులు తో బాటు బంగ్లా దేశీయులు ఉమ్మడి గా దీని లొని చేపల్ని పట్టుకుంటారు.ఒక రౌండ్ వేసి రావడానికి పడవల వాళ్ళు మూడు వందల రూపాయాలు వసూలు చేస్తున్నారు.
No comments:
Post a Comment