టి.కృష్ణ మోహన్ రెడ్డి ఒడిశా లోని బరంపురం కుర్రాడు.ఇతను తన ప్రిన్స్ డాన్స్ అకాడమీ ద్వారా ఒక విప్లవమే రేపాడు.తెలుగు వారికి కొదువ ఏముంది అక్కడ.ఒకప్పుడు తెలుగు ప్రాంతమే,కాల మహిమ వల్ల ఆ పట్టణం ఒరిస్సా లో కలిసిపోయింది.ఆ ప్రాంత వాసుల్ని ప్రవాసాంధ్రులు అంటే విజయచంద్ర వంటి కవులు ఒప్పుకోరు గాక ఒప్పుకోరు.ఎప్పుడో మా తాత తండ్రులనుంచి ఇక్కడే ఉన్నాం,పెరిగాం ,ఎక్కడ నుంచీ మేము వలస రాలేదు ..కాకపోతే మా ప్రాంతాన్ని ఒరిస్సా లో కలిపివేయడం వల్ల మేము అలా పిలువబడుతున్నాం..అంతే అంటారు.నేను బరంపురం వెళ్ళి ఆ నేల లో తిరిగిన తర్వాత అది నూటికి నూరు పాళ్ళు నిజమని అనిపించింది.
సరే..ఈ కృష్ణారెడ్డి గా పిలువబడే బరంపురం కుర్రాడి గురించి భుబనేశ్వర్ నుంచి వెలువడే ఓ పత్రిక "మై సిటీ లింక్స్" ఇటీవల రాసింది చదివాక ఇది రాయాలనిపించింది.ఇతను తన జీవిత కధ ని సినిమా గా తీశాడు.అది ఇప్పుడు ఒరిస్సా లో రిలీజ్ అవడానికి తయారు గా ఉంది.ఇంతకీ ఈ యువకుని గొప్పదనం ఏమిటంటే 2009 లో ఓ హిందీ చానల్ లోని " India's Got Talent" అనే డాన్స్ కాంపిటేషన్ లో పాల్గొని విజేత గా నిలిచి 50లక్షల నగదు,ఆడీ కార్ ని గెలుచుకున్నాడు.ఇతను ట్రూప్ లో 20 మంది ఉంటారు.ప్రిన్స్ డాన్స్ అకాడమీ అనే పేరు తో ఈయన చేసే కృషికి అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందించి 2కోట్ల నగదు సాయం ని,భూరి విరాళం ని ఇచ్చి ప్రోత్సహించాడు.
దానితో కృష్ణా రెడ్డి తన కార్యక్రమాల్ని విస్తరించి ఇతర రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ వంటి చోట్ల కూడా పోటీలో ఫాల్గొని గెలిచాడు.ఇప్పుడు తాను తన కధనే సినిమా గా తీశాడు.ఎన్ని అవాంతరాల్ని ఎదుర్కొని తను సక్సస్ గా నిలిచింది దీనిలో వివరించాడు.దీని కధ, స్క్రీన్ ప్లేయ్,డైరెక్షన్ అన్నీ ఆయనే.ఈ సినిమా పేరు "కృష్ణా ,ద డాన్సర్".రెండున్నర గంటల ఈ సినిమా ఒరిస్సా లో బాగా ఆడి తనకి పేరు ఇంకా ఇనుమడింప చేసందని ఆశిస్తున్నాడు.
No comments:
Post a Comment