Sunday 13 April 2014

వివాహేతర సంబంధం పెట్టుకున్న స్త్రీని కూడ శిక్షించాలి: సమాజ్ వాది నేత అబూ ఆజ్మి



అదేమిటో గాని సమాజ్ వాది పార్టీ నేతలు ఒకరి తరవాత ఇంకొకరు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.మహారాష్ట్ర సమాజ్ వాది పార్టీ నేత అబూ అజ్మీ ఈరోజు మాట్లాడుతూ వివాహేతర సంబంధం పెట్టుకున్న స్త్రీ ని కూడా శిక్షించాలని,ఆమెకి పెళ్ళి అయినా కాకపోయినా ,తన ఇష్టంతో గాని లేదా రేప్ చేయబడి గాని  ఒక పరాయి పురుషునితో సెక్స్ లో  ఫాల్గొన్నట్లయితే ఆమె ని కూడా శిక్షించవలసిందేనని అన్నారు.ఈ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర మహిళా కమీషన్ అతనికి సూమోటో షోకాజ్ నోటిస్ ని ఇష్యూ చేసింది.ఈ నెల 25 న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని లేనట్లయితే తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.కాగా వివిధ మహిళా సంఘాలు ఆజ్మి వ్యాఖ్యల్ని తీవ్రంగా నిరసించాయి.Click here

No comments:

Post a Comment