Thursday 9 February 2017

ఇండియన్ ఎక్స్ ప్రెస్ గుర్తించిన వరంగల్ కుర్రాడి కృషి



అరవింద్ పకిడె (21) వరంగల్ జిల్లా లోని కాంచనపల్లి గ్రామానికి చెందిన కుర్రవాడు.అతని అభిరుచి మూలంగా  చక్కని బ్లాగ్ నిర్వహిస్తూ దాదాపు 400 వందల పురాతత్వ,చారిత్రక ప్రదేశాలను శోధించి తన బ్లాగు లో వివరించాడు.అవి మాత్రమే కాక గుళ్ళు ,చెరువులు ఇలా అనేక ఆసక్తికరమైన అంశాల్ని పొందుపరిచాడు.ఇతను చేపట్టిన మంచి పనులను వివరిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఈ నెల 6 వ తారీఖు పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది.వీలైతే చదవండి. 

Sunday 22 January 2017

ముగ్గురు విద్యార్థుల్ని బహిష్కరించిన SFI...



కేరళ రాష్ట్రం లో ఎర్నాకులం మహారాజా కాలేజీ లో ప్రిన్సిపాల్ కుర్చీ ని తగలబెట్టిన విషయం లో   లో CPM పార్టీ కి అనుబంధం  గా ఉన్న SFI నుంచి ముగ్గురు విద్యార్థుల్ని ఆ సంఘం బహిష్కరించింది.CPM ఇంకా SFI రెండు వర్గాల నాయకులు ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ సంఘటన గత గురు వారం జరిగింది.గత నెల లో గోడల పై అసభ్య రాతలు రాసినందుకు ప్రిన్సిపాల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు దాని తో ఆ ముగ్గురు విద్యార్థుల ని అరెస్ట్ చేసి ఇటీవలనే బెయిల్ పై వదిలారు.బయటకి వచ్చిన ఆ ముగ్గురు ప్రిన్సిపాల్ కుర్చీ ని బయటకి తీసుకు వచ్చి నిప్పంటించారు.ఈ విషయం మీద ఆ రాష్ట్ర అసెంబ్లీ లో విపక్ష నేత రమెష్ చెన్నితల నిప్పులు చెరగడం తో ఈ చర్య తీసుకున్నారు.  

Tuesday 10 January 2017

ఎయిర్ ఇండియా ప్రపంచ స్థాయి లో మూడవ వరుస లో నిలిచింది.



ఎయిర్ ఇండియా ప్రపంచ స్థాయి లో మూడవ వరుస లో  నిలిచింది.ఇంతకీ దేనిలో అనుకుంటున్నారు , అతి చెత్త నిర్వహణ లో ! విమాన సర్వీసుల  ఆలశ్యం తీరు ,కేబిన్లు,మిగతా సర్విసుల క్వాలిటీ లని పరిగణన లోకి తీసుకొని ఫ్లైట్ డేటా ఫర్మ్ అనే సంస్థ ఈ లెక్కల్ని వేసింది.మిగతా పది చెత్త కింద నిలిచినవి ఏవో తెలుసునా..అవి ఎయిర్ చైనా,హాంగ్ కాంగ్ ఎయిర్ లైన్స్ ,ఫిలిప్పైన్ ఎయిర్ లైన్స్,ఖతర్ ఐర్ లైన్స్ ఇలా తేలాయి.కాగా ఈ సర్వెయ్ సరైనది కాదని ఎయిర్ ఇండియా తోసిపుచ్చింది. 

Sunday 18 December 2016

చాలానాళ్ళకి ఒక ఆలోచనలు రేపే పుస్తకం



ఇంగ్లీష్ అవసరం తెలుగు సమాజం లో ఉందా లేదా..ఉన్నట్లయితే ఎంత దాకా ఉంది..? ప్రతి గ్రామం లో ఈ రోజున ఇంగ్లీష్ పాఠశాల వెలుస్తున్నది గాని సరైన ఇంగ్లీష్ పరిజ్ఞానం ఎందుకని నెలకొల్ప లేకపోతున్నది..: ఎక్కడ లోపం ఉంది..? దీనికి తరుణోపాయం ఎక్కడ  ఉన్నది..?ఇప్పటికే ఉన్న అభ్యసన విధానం  లో ఏ మార్పులు అవసరం..?మొత్తం మీద కలిపి ఇరవై ఏళ్ళు విద్యాలయాల్లో గడిపిన సరైన జ్ఞానం..అంటే కనీసం ఓ వ్యాసం రాసే పరిజ్ఞానం లేకుండా ఎందుకు పోతున్నది..? ఇలాంటి విషయాలన్ని ఎలాంటి శష భిషలు లేకుండా  చర్చిన మొట్ట మొదటి పుస్తకం..! అంతే కాదు వివిధ  ఆంగ్ల రచయితల శైలి ని వివరిస్తూ వారి నవలల్ని విశదీకరించిన పుస్తకం ఇది.బహుశా ఇది తెలుగు రచనా రంగం లో ఒక విన్నూత్న తరహా కి చెందిన పుస్తకం అని చెప్పవచ్చు.ప్రతి తెలుగు పాఠకుడు చదవవలసిన పుస్తకం ఈ" మూర్తీస్ మ్యూజింగ్స్"  .

For Copies: Navachetana Book house and Navodaya book house,Hyderabad., Visalandhra book house ,Vijayawada.

Monday 14 November 2016

"బలియాత్ర" పండుగ సంబరాలు ఈ రోజునుంచే ...



ఈ రోజు బలియాత్ర పండుగ సంబరాలు ఒరిస్సా లోని కటక్ పట్టణం లో మహానది తీరాన మొదలవుతున్నాయి. కళింగ ప్రాంతానికి చెందిన జాలరులు తమ నౌకలపై అనేక శతాబ్దాల క్రితం ఇండోనేషియా వద్ద గల దీవులను చేరుకొని విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ పండుగని కొన్ని వందల ఏళ్ళ నుంచి జరుపుతున్నారు.వారం పాటు సాగే ఇక్కడి తిరునాళ్ళ లో ఈ రాష్ట్రం లోని వారే గాక,ఇతర రాష్ట్రాలనుంచి తమ కళాకృతులను తెచ్చి అమ్ముతుంటారు.ఏటా రమారమి 80 నుంచి వంద కోట్ల వ్యాపారం సాగుతుంది.దీనిని పల్లె శ్రీ మేళా అంటారు.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర్నుంచి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి పర్యావరణం నిమిత్తం అనుమతులు తీసుకు రావలసి వచ్చింది.


ఒరిస్సా లోని కేంద్రపడా నుంచి రసాబలి,పూరి నుంచి మాల్ పూవా,ధెంకనాల్ నుంచి బారా,కకేరా,..బారిపడా నుంచి మటం ముధి లు వంటి సంప్రదాయ వంటకాలు నోరు ఊరించనున్నాయి.మొత్తం మీద 1700 స్టాళ్ళు ఏర్పాటు అవుతాయని వార్త. దేశం లోని 28 రాష్ట్రాలనుంచి తమ ఉత్పత్తుల్ని అమ్మడానికి రానున్నారు.ట్రాన్స్ జెండర్స్ కి,అంగవికలాంగులకి సైతం ఈ సారి కొన్ని స్టాళ్ళు రిజర్వ్ చేశారు.



ఒరియా సాన్స్కృతిక వాతావరణానికి ప్రతిబింబం లా సాగే ఈ ఉత్సవాలలో అనేక కళా ప్రదర్శనలు సైతం ఉంటాయి. ఈ  నెల 22 దాక బలియాత్ర ఉత్సవాలు కొనసాగుతాయి. 

Thursday 10 November 2016

ఇండోనేషియా లోని కొన్ని అద్భుత ప్రదేశాలు


ఇండోనేషియా రమారమి 18,000 పై చిలుకు ద్వీపాల తో కూడిఉన్న దేశం.అయితే వాటిల్లో జనాలు ఉండేది కేవలం ఆరు వేల దీవుల్లోనే అని చెప్పాలి.24 కోట్ల జనాభా తో 300 విభిన్న తెగలతో 250 భాషలతో అలరారుతున్న ఆ దేశం లో ఎన్నో చూడదగిన  ప్రదేశాలు ఉన్నాయి.బాలి,సుమత్రా దీవులు పర్యావరణ టూరిజం కి పేరెన్నిక గన్నవి.

ఈ కింద కనిపిస్తున్న ది లేక్ తోబా.వంద కి.మీ పొడవు,30 కి.మీ. వెడల్పు ఉండే చెరువు డబ్భై వేల ఏళ్ళ క్రితం అగ్నిపర్వతం పేలినప్పుడు ఏర్పడినది.నీళ్ళు వెచ్చగా ఉంటాయి.ఇక్కడికి పర్యాటకులు తరచూ వస్తుంటారు.


ఈ కింది చిత్రం బొరోబుడుర్ ,ఒక బోఉధ దేవాలయం. 8 వ లేదా 9 వశతాబ్దం లో శైలేంద్ర అనే రాజు కట్టించినవి.ఇది జావా ద్వీపం లో ఉన్నది.అయితే 14 వ శతాబ్దం లో ఈ నిర్మాణాన్ని గుర్తు దొరకని కారణాల తో అప్పటి పాలకులు వదిలి వేయగా ఒక అరణ్యం మధ్య లో కనుగొని పర్యాటకుల కోసం దీని తెరిచి ఉంచుతున్నారు.

Wednesday 12 October 2016

వియాత్నాం యుద్ధం గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?



క్రి.శ.938 వరకు వియాత్నాం దేశం చైనా యొక్క ఆధీనం లో ఉండేది.రమారమి 1000 ఏళ్ళ పాటు ఇలా ఉన్నది.

ఆ తర్వాత ఫ్రెంచ్ వారి పాలన లోకి వచ్చి 19 వ శతాబ్దం మధ్య వరకు కొనసాగింది. 1954 లో ఫ్రెంచ్ వారు వైదొలగారు.

అమెరికన్ కాంగ్రెస్ దృష్టి లో వియాత్నం వార్ అనేదాన్ని Conflict గానే తప్ప యుద్ధం గా గుర్తించలేదు.

ఆ సమయం లో యుద్ధం లో ఫాల్గొన్న అమెరికన్ సైనికుల్లో మూడింట రెండు వంతులు స్వచ్చందగానే చేరారు.

రెండవ ప్రపంచ యుద్ధం 4 ఏళ్ళు జరిగింది.దాని లో 40 రోజులు Combat days గా గుర్తించారు.అయితే వియాత్నాం యుద్ధం లో 1 ఏడాది లో 240 Combat days గా తేల్చారు.

విజయావకాశాలు సన్నగిల్లడం తో అమెరికా యుద్ధం నుంచి విరమించింది తప్ప ఓటమి తో కాదు.

ఈ యుద్ధం తర్వాత ఇండోనేషియా,థాయ్ లాండ్ ,సింగ పూర్,మలేషియా ల్లో కమ్మ్యూనిజం ప్రభావాన్ని గణనీయం గా తగ్గించగలిగారు.