Thursday 27 March 2014

పోప్ కి విత్తనాల్ని బహూకరించిన ఒబామా



ఈ రోజు వాటికన్ లో అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా కి పోప్ ఫ్రాన్సిస్ నుంచి సాదర స్వాగతం లభించింది.వాళ్ళు ఇరువురు కలుసుకోవడం ఇదే మొదటిసారి.అందమైన ఫ్రెస్కొ లతో నిండిన విశాలమైన హాలులో వారు సమావేశమయ్యారు.ఈ సంధర్భంగా పోప్ కి ఒక విత్తనాల సంచిని ఒబామ బహూకరించారు,అవి కేరట్ విత్తనాలని భావిస్తున్నారు.తాను పోప్ ఫ్రాన్సిస్ అభిమానిగా చెప్పారు.తమ దేశం లోని కేథలిక్కులను దువ్వే చర్యల్లో భాగంగా ఈ మాట అన్నట్టు పలువురు భావిస్తున్నారు.ఇటలీ దేశ అధ్యక్షుడిని,ప్రధాని ని కూడ ఒబామా కలుస్తారు.Click here  

No comments:

Post a Comment